Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 123708
            [news_title_telugu_html] => 

దక్షిణాఫ్రికా ఓటమికి అదే కారణం

[news_title_telugu] => దక్షిణాఫ్రికా ఓటమికి అదే కారణం [news_title_english] => Jonty Rhodes says South Africa doesnt had Plan B [news_short_description] => ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఆసీస్‌ x భారత జట్లే తలపడతాయని అందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీరోడ్స్‌ అన్నాడు. అయితే ఈ రెండింటిలో ఏది [news_tags_keywords] => Cricket,INDvsAUS,World Cup 2019,CWC19,South Africa [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-09 11:20:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దక్షిణాఫ్రికా ఓటమికి అదే కారణం - Jonty Rhodes says South Africa doesnt had Plan B - EENADU
close

తాజా వార్తలు

దక్షిణాఫ్రికా ఓటమికి అదే కారణం

భారత్ x ఆస్ట్రేలియా జట్లే ఫైనల్స్‌లో తలపడతాయి

దిల్లీ: ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఆసీస్‌ x భారత జట్లే తలపడతాయని అందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీరోడ్స్‌ అన్నాడు. అయితే ఈ రెండింటిలో ఏది ఫేవరెట్‌ జట్టో చెప్పడం కష్టమని తెలిపాడు. దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అతడు ఓ జాతీయ పత్రికతో మాట్లాడాడు. టీమిండియా తొలి నాకౌట్‌లో న్యూజిలాండ్‌ని ఓడిస్తుందని, అలాగే ఇంగ్లాండ్‌ను ఆసీస్‌ జట్టు రెండో నాకౌట్‌లో చిత్తుచేస్తుందని అన్నాడు. ఇదిలా ఉండగా ఈ టోర్నీలో విఫలమైన దక్షిణాఫ్రికా ఏడు పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 

ఈ విషయంపై స్పందించిన రోడ్స్‌.. ఏడాది కాలంగా దక్షిణాఫ్రికా స్వదేశంలోనూ సరైన ఫలితాలను సాధించలేదని, ప్రపంచకప్‌లో ఆడే జట్టులో ఎవరెవరు ఉంటారనే స్పష్టమైన సమాచారం వారికి లేదని  చెప్పాడు. మెగా టోర్నీలో ఎవరెవరు ఆడతారనే విషయం కూడా తెలియకపోతే ఆ జట్టు పరిస్థితి బాగోలేనట్టేనని అన్నాడు. ‘ఈ టోర్నీకి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న జట్టు.. ప్రపంచకప్‌లో నిరాశ పరిచింది. ఆఖరి నిమిషంలో వస్తానన్న ఏబీ డివిలియర్స్‌ను తిరిగి తీసుకోకపోవడం సరైన విషయమే. అయితే ఇక బాగా ఆడతారనుకున్నవాళ్లు చేతులెత్తేశారు’ అని పేర్కొన్నాడు.

మరోవైపు సఫారీలు ఒకే ప్రణాళిక అవలంబించారని, రెండో ప్రణాళికతో ఆడలేదని విమర్శించాడు. ఇంగ్లాండ్‌లో రెండు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని, అందుకు తగట్టు బౌలింగ్‌ ఒక్కటే కాకుండా వేరే ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉండేదని రోడ్స్‌ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.