
తాజా వార్తలు
మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్
లండన్: ప్రపంచకప్ అంతిమపోరులో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ x భారత జట్లే తలపడతాయని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పాడు. లీగ్ దశలో టాప్ నాలుగు జట్లుగా నిలిచిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రెండు నాకౌట్లలో తలపడనున్నాయి. మాంచెస్టర్ వేదికగా మంగళవారం తొలి నాకౌట్ జరగనుంది. లీగ్ దశలో దుమ్మురేపిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తుచేసి ఫైనల్స్ చేరుతుందని పీటర్సన్ ఆశాభావం వ్యక్తంచేశాడు.
మరోవైపు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైన ఆసీస్ జట్టుని ఇంగ్లాండ్ ఓడిస్తుందని అన్నాడు. కీలక సమయంలో ఆతిథ్య జట్టు ఆటగాళ్లు జేసన్‌రాయ్, జోరూట్, బెయిర్‌స్టో, జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లోకి వచ్చారని, గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగబోయే రెండో నాకౌట్లో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లో ఆసీస్‌ను ఇంగ్లాండ్ చిత్తుచేసి ఫైనల్స్ చేరుతుందని తెలిపాడు. దీంతో జులై 14న లార్డ్స్ మైదానంలో భారత్ X ఇంగ్లాండ్ మధ్యే రసవత్తరమైన పోరు జరుగుతుందని ట్వీట్ చేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- ఫ్యాన్ మృతిపట్ల చెర్రీ ఆవేదన..వీడియో వైరల్
- రేషన్ జాబితా నుంచి వారిని తొలగించొద్దు
- నాగేశ్వరరావు న్యాయం చేయలేడన్నారు!
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- వాహనాల విక్రయాలు.. మళ్లీ తగ్గాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
