close

తాజా వార్తలు

44 ఏళ్ల తర్వాత ‘కెప్టెన్’ ఇన్నింగ్స్

మాంచెస్టర్‌: వరుణుడి అడ్డంకితో భారత్‌xన్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌కు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో 67 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో భారత్‌పై 50 పరుగులకు పైగా సాధించిన రెండో కివీస్ సారథిగా అతను రికార్డుకెక్కాడు. 1975 ప్రపంచకప్‌లో భారత్‌పై అప్పటి కివీస్‌ కెప్టెన్ టర్నర్ (114*) అజేయ శతకం సాధించాడు. ఆ తర్వాత భారత్‌, కివీస్‌ ప్రపంచకప్‌లో ఆరు సార్లు తలపడినా ఏ కివీస్‌ కెప్టెన్‌ అర్ధశతకం బాదలేకపోయారు. 44 ఏళ్ల తర్వాత టీమిండియాపై కివీస్‌ సారథి విలియమ్సన్ అర్ధశతకం అందుకోవడం విశేషం. ప్రస్తుత ప్రపంచకప్‌లో కేన్‌ విలియమ్సన్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లో 91.33 సగటుతో 548 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో అతను రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు బాదాడు.

మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్:
సహచరులంతా విఫలమవుతున్నా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లతో జట్టును సెమీస్‌కు చేర్చిన విలియమ్సన్ (67) సెమీస్‌లోనూ అలరించాడు. ఆదిలోనే గప్తిల్‌ (1) వికెట్‌ను కోల్పోయినా హెన్రీ నికోల్స్‌ (28)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నికోల్స్‌ ఔటైన తర్వాత రాస్‌ టేలర్‌ (67*)తో కలిసి భారత్ బౌలర్లును ఎదుర్కొన్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ మరో నాలుగు ఓవర్లలో ముగిసే సమయంలో వర్షం పడింది. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం కివీస్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ప్రస్తుతానికి పరిస్థితి అర్థం కావడం లేదు. మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించితే 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. ఈ రోజు అసలు మ్యాచ్‌ జరగకపోతే రేపటికి వాయిదా వేస్తారు. రేపు కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టుని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. దీంతో 15 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.