
తాజా వార్తలు
గెలిచే అవకాశమున్నా.. కోల్పోయింది
దిల్లీ: మాంచెస్టర్ వేదికగా బుధవారం జరిగిన సెమీస్‌లో టీమిండియాని ఓడించిన న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్స్ చేరింది. రవీంద్ర జడేజా అద్భుత పోరాటాన్ని కాచుకొని 18 పరుగుల తేడాతో విలియమ్సన్ జట్టు తుదిపోరుకు చేరుకుంది. లీగ్ దశలో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కివీస్ సెమీస్‌లో భారత్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఎవరు గెలిస్తే వారితో ఆదివారం లార్డ్స్‌లో తలపడనుంది. ఇదిలా ఉండగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమికి నాలుగు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి పరిశిలిస్తే..
టాప్ ఆర్డర్ వైఫల్యం: అప్పటికే వర్షం పడి మందకొడిగా మారిన పిచ్ బౌలర్లకు సహకరించింది. లీగ్దశలో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన బ్యాట్స్‌మెన్ కీలక పోరులో జాగ్రత్తగా ఆడాల్సింది. కానీ, బంతి అనూహ్యంగా స్వింగ్ అవ్వడంతో రోహిత్, కోహ్లీ, రాహుల్ ఒక్కో పరుగుకే వెనుతిరిగారు.
కివీస్ ఫీల్డింగ్ అదరహో: లీగ్ దశలో రోహిత్‌శర్మ ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను ప్రత్యర్థి ఆటగాళ్లు జారవిడిచారు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ రెచ్చిపోయి మూడు శతకాలు, ఒక అర్ధశతకం సాధించాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన బంతి వికెట్ల వెనక్కి వెళ్లడంతో కీపర్ టామ్ లాథమ్ ఏ తప్పూ చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆపై రాహుల్ సైతం వికెట్కీపర్కే చిక్కాడు. ఇక దినేశ్ కార్తిక్ ఆడిన బంతిని నీషమ్ ఒంటి చేత్తో డైవ్ చేస్తూ పట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆఖర్లో మార్టిన్ గప్తిల్.. ధోనీకి వేసిన డైరెక్ట్ త్రో మ్యాచ్‌కే హైలైట్. ధోనీ వెనుదిరగడంతో న్యూజిలాండ్ గెలుపొందింది.
పంత్, పాండ్య తప్పుడు షాట్లు: కార్తిక్ ఔటయ్యాక, రిషభ్‌పంత్(32), హార్దిక్ పాండ్య(32) కుదురుకున్నాక ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ స్పిన్ బౌలర్ మిచెల్ శాంట్నర్‌ని టార్గెట్ చేసి బౌండరీలు సాధించాలని భావించి ఒకేతీరులో పేలవమైన షాట్లు ఆడారు. దీంతో గ్రాండ్‌హోమ్, విలియమ్సన్ చేతులకు చిక్కి ఔటయ్యారు.
ఒత్తిడి పెరిగి.. వికెట్లు కోల్పోయి : సాధించాల్సిన రన్‌రేట్ చాలా ఉన్నా ధోనీ(50), రవీంద్ర జడేజా(77) మొదట ఆచితూచి ఆడారు. వీరిద్దరూ వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పినా.. చివరి ఓవర్లలో ఒత్తిడి పెరగడంతో వికెట్లు కోల్పోయారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
