close

తాజా వార్తలు

 రనౌట్‌.. రెండు ఫైనల్స్‌ను దూరం చేసింది..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌×న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌట్‌ అవ్వకపోతే ఫలితం వేరుగా ఉండేదని క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. భారత్‌కు ఓటమి తప్పదని అనుకున్న సందర్భంలో జడేజా అద్భుత ప్రదర్శనతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఆఖర్లో జడేజా పెవిలియన్‌కు చేరినా ధోనీ క్రీజ్‌లో ఉండటంతో గెలుపుపై ధీమా ఉంది. కానీ ధోనీ అనూహ్యంగా రనౌటవ్వడంతో టీమిండియా మెగాటోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి 2015 ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ ఎదురైంది. అప్పడు కూడా ధోనీపైనే అందరి ఆశ. జట్టుని విజయతీరాలకు చేర్చుతాడనుకునన్న ధోనీ రనౌటవ్వడంతో టోర్నీ నుంచి భారత్‌ వైదొలగాల్సి వచ్చింది.

2015 ప్రపంచకప్‌: 
టేబుల్‌ టాపర్‌గా భారత్‌. ఆరు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులను చిత్తుచేసి సెమీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో పోరుకు సిద్ధమైంది. టోర్నీలో ఓటమి ఎరుగని భారత్‌ తుదిపోరుకు అర్హత సాధిస్తుందని భావించారంతా. కానీ ఆసీస్‌ టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసి భారత్‌కు 329 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా కావాలిసిన రన్‌రేటు పెరుగుతున్నా తన పోరాటం సాగించాడు. విజయానికి 48 బంతుల్లో 121 పరుగుల అవసరమవ్వగా ధోనీ వరుస సిక్సర్లతో కంగారూలను కంగారు పెట్టించాడు. కానీ తర్వాత ధోనీ రనౌటవ్వడంతో ఆసీస్‌ విజయం లాంఛనమైంది. 

ప్రస్తుత ప్రపంచకప్‌:
ఏడు విజయాలు, ఒక ఓటమి, ఫలితం తేలని ఒక మ్యాచ్‌తో భారత్‌ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్‌లో భారత జట్టుకు న్యూజిలాండ్‌ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్‌ కోహ్లీ.. టోర్నీలో ఐదు శతకాలతో ప్రత్యర్థులపై చెలరేగుతున్న రోహిత్.. నిలకడగా రాణిస్తూ ధావన్‌ లేని లోటుని భర్తీ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌.. జట్టులో ఉండటంతో భారత్‌ విజయం ఖాయమనుకున్నారు అంతా. కానీ కివీస్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు విసురుతుండటంతో టాప్‌ ఆర్డర్‌ ఐదు పరుగులకే డగౌట్‌కు చేరింది. తర్వాత బ్యాట్స్‌మెన్‌ కూడా పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ ఓటమి కోరల్లో చిక్కుకుంది. కానీ ధోనీ-జడేజా అద్భుత పోరాటంతో టీమిండియా రేసులోకి వచ్చింది. జడేజా ఔటైనా అత్యుత్తమ ఫినిషర్‌ ధోనీ క్రీజ్‌లో ఉండటంతో గెలుపు భరోసాకి డోకా లేదు. కానీ గప్తిల్‌ కళ్లు చెదిరే త్రో విసరడంతో ధోనీ రనౌటయ్యాడు. అంగుళం దూరంలో ధోనీ వికెట్‌ను కోల్పోవడంతో.. భారత్‌ టోర్నీ నుంచే దూరమయ్యింది.    


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.