close

తాజా వార్తలు

సచిన్‌తో సమానంగా స్టీవ్‌స్మిత్‌

ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాకౌట్‌ పోరులో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించడంతో ప్రపంచకప్‌లో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ సాధించిన ఓ రికార్డును సమం చేశాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో సచిన్‌ గతంలో నాలుగు అర్ధశతకాలు సాధించాడు. ఆ తర్వాత స్టీవ్‌స్మిత్‌ ఒక్కడే ఆ రికార్డును చేరుకున్నాడు. సచిన్‌ మూడు టోర్నీల్లో ఏడు నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా స్మిత్‌ రెండు టోర్నీల్లో నాలుగు వరుస నాకౌట్లలోనే అర్ధశతకాలు సాధించాడు. దీంతో అతడు సచిన్‌తో సమానంగా నిలిచాడు.

కాగా ఈ ప్రపంచకప్‌కి ముందు స్మిత్‌ ఏడాదిపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా ఆటకు దూరమై నేరుగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.