
తాజా వార్తలు
గిల్‌క్రిస్ట్, స్టీవ్‌వా మద్దతు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించడంతో ధోనీ భవితవ్యంపై అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇద్దరు ఆసీస్ మాజీ ఆటగాళ్లు అతనికి అండగా నిలిచారు. కంగారూల మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో పాటు, కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ ధోనీకి మద్దతు తెలిపారు. టీమిండియా ఓటమిపై ధోనీని ఒక్కడినే నిందించడం సరికాదని, గతంలో అతను అనేక మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడని స్టీవ్‌వా అన్నాడు. భారత జట్టు గెలిచే అవకాశమే లేని మ్యాచ్‌లను సైతం ధోనీ ఎన్నో గెలిపించాడని కొనియాడాడు.
ప్రతి ఆటనీ గెలవలేమని, కివీస్‌తో మ్యాచ్‌లో రనౌట్ కాకపోయి ఉంటే.. ధోనీ గెలిపించేవాడని అన్నాడు. వన్డేల్లో ఛేదన అంత సులభతరం కాదని, వన్డే చరిత్రలో ధోనీ గెలిపించినన్ని మ్యాచ్‌లు ఎవరూ గెలిపించలేదని గుర్తుచేశాడు. 240 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తుందని అనుకున్నా, కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని మాజీ కెప్టెన్ మెచ్చుకున్నాడు.
ఇదిలా ఉండగా ఆసీస్ మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ ధోనీని ఉద్దేశిస్తూ రెండు భావోద్వేగపూరిత ట్వీట్లు చేశాడు. అతడి రిటైర్మెంట్పై వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘ఇకపై నువ్వు క్రికెట్ ఆడతావో లేదో తెలీదు. కానీ ఇప్పటివరకు క్రికెట్‌కు అందించిన సేవలకు ధన్యవాదాలు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడంతోపాటు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటావు. నిన్ను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాము’ అని పేర్కొన్నాడు.
మరో ట్వీట్లో ‘ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు గెలవాలంటే అనేక విషయాలు కలిసి రావాలి. ఈ క్రమంలో ఏ చిన్న తప్పు జరిగినా వాటి ఫలితం తీవ్రంగా ఉంటుంది. టీమిండియా అద్భుతమైన జట్టు, మీ ఆటతీరు చూడటానికి ఎంతో బాగుంది’ అని గిల్లీ రెండో ట్వీట్ చేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
