
తాజా వార్తలు
లండన్: ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో ఆతిథ్య ఇంగ్లాండ్ X న్యూజిలాండ్ మధ్య తుదిపోరు ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన కివీస్.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఈ సారైనా విశ్వవిజేతగా నిలవాలని విలియమ్సన్ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ 1992 తర్వాత ఫైనల్స్ చేరడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రెండు జట్లూ ఇప్పటివరకు ప్రపంచకప్ గెలవకపోవడంతో తొలిసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్‌టేలర్, జేమ్స్ నీషమ్, టామ్‌లాథమ్, కొలిన్డి గ్రాండ్‌హోమ్, మిచెల్ శాంట్నర్, మాట్హెన్రీ, ట్రెంట్‌బౌల్ట్, లాకీ ఫెర్గూసన్
ఇంగ్లాండ్ జట్టు: జేసన్‌రాయ్, జానీ బెయిర్‌స్టో, జోరూట్, ఇయాన్‌మోర్గాన్(కెప్టెన్), బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్‌వోక్స్, లియామ్ ప్లంకెట్, జోఫ్రాఆర్చర్, అదిల్ రషీద్, మార్క్‌వుడ్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
