Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 126815
            [news_title_telugu_html] => కివీస్‌ ఎందుకు విజేత కాకూడదు?
            [news_title_telugu] => కివీస్‌ ఎందుకు విజేత కాకూడదు?
            [news_title_english] => What does the ICC rule saying about over throw
            [news_short_description] => ప్రపంచకప్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠగా సాగింది. రెండు జట్ల స్కోర్లూ సూపర్‌ ఓవర్‌లోనూ  సమానంగా 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-07-15 17:29:17
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
కివీస్‌ ఎందుకు విజేత కాకూడదు? - What does the ICC rule saying about over throw - EENADU
close

తాజా వార్తలు

కివీస్‌ ఎందుకు విజేత కాకూడదు?

ఆ ఓవర్‌ త్రోకు ఐసీసీ నిబంధన ఏం చెబుతోందంటే?

లండన్‌: ప్రపంచకప్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠగా సాగింది. రెండు జట్ల స్కోర్లూ సూపర్‌ ఓవర్‌లోనూ  సమానంగా మారడంతో.. ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్‌ జట్టే కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయంలో ఆటకన్నా.. ఎక్కువగా ఆ జట్టు అదృష్టమే ముఖ్య పాత్ర పోషించిందని పలువురు అంటున్నారు. దాని ఫలితంగానే కివీస్‌ కప్పును కోల్పోయిందని భావిస్తున్నారు.

మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. విలియమ్సన్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కి బంతినివ్వగా తొలి రెండు బంతులను డాట్‌బాల్స్‌గా మార్చాడు. స్టోక్స్‌ మూడో బంతిని సిక్స్‌గా మలచడంతో సమీకరణం మూడు బంతుల్లో 9 పరుగులకు మారింది. అయితే నాలుగో బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా ఆడిన స్టోక్స్‌ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఫీల్డర్‌ బంతిని కీపర్‌కు విసరడంతో స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలిన బాల్‌ బౌండరీ చేరింది. ఈ ఓవర్‌త్రో కారణంగా ఇంగ్లాండ్‌ జట్టుకు మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. ఆతిథ్య జట్టుకు అదనంగా నాలుగు పరుగులు రావడంతో సమీకరణాలు మారిపోయి స్కోర్‌ టైగా ముగిసింది. 

ఐసీసీ నిబంధన..
ఆ ఓవర్‌లో న్యూజిలాండ్‌ ఫీల్డర్‌ విసిరిన ఓవర్‌ త్రో వల్ల ఇంగ్లాండ్‌ జట్టుకు ఐదు పరుగులే రావాలని పలువురు క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ‘ఎవరైనా ఫీల్డర్‌ ఓవర్‌ త్రో వేసిన బంతి బౌండరీ చేరినప్పుడు ప్రత్యర్థి జట్టుకు బౌండరీ పరుగులు, అప్పటికే పూర్తి చేసిన పరుగులతో పాటు ఫీల్డర్‌ బంతి విసరక ముందే బ్యాట్స్‌మెన్‌ తీయాలనుకున్న పరుగులను కలిపివ్వాలి’. అయితే నిన్నటి మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌ రెండో పరుగుకు ప్రయత్నించకముందే ఫీల్డర్‌ బంతి విసరడంతో దానికి పరుగు లెక్కించొద్దని కొందరు భావిస్తున్నారు. 

ఒకవేళ ఈ నిబంధన ప్రకారం పరుగులు లెక్కించి ఉంటే న్యూజిలాండ్‌ జట్టే విజేతగా నిలిచేదని అంటున్నారు. మరోవైపు విజేతని ప్రకటించడంలో ఐసీసీ నిబంధనలు దారుణంగా ఉన్నాయని, బౌండరీల ఆధారంగా ఎలా నిర్ధారిస్తారని పలువురు క్రీడాభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై కివీస్‌ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టైరిస్‌ సైతం సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.