close

తాజా వార్తలు

పిల్లలూ.. ఆటలకి దూరంగా ఉండండి : కివీస్‌ ఆటగాడు 

ఓటమి అనంతరం చిన్నారులను ఉద్దేశించి కివీస్‌ క్రికెటర్‌

లండన్‌: ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో చిన్నపాటి నిబంధన కారణంగా ఓటమిపాలైన న్యూజిలాండ్‌ జట్టు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మ్యాచ్‌ టైగా ముగిసినప్పటికీ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎక్కువ బౌండరీలు కొట్టారని విశ్వవిజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భావోద్వేగానికి గురైన కివీస్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ ట్విటర్‌లో అనూహ్య పోస్టు పెట్టాడు. 

విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టుకు తొలుత అభినందనలు తెలిపిన నీషమ్ ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో ఆఖరి అరగంట మ్యాచ్‌ను తాను ఈ దశాబ్దంలో గుర్తు చేసుకోనని అన్నాడు. అలాగే తమ జట్టుకు మద్దతుగా నిలిచి అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ప్రపంచకప్‌లో తమపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయామని క్షమాపణలు తెలిపాడు. ఇక తర్వాతి ట్వీట్‌లో చిన్నపిల్లలను ఈ ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. క్రికెట్‌కి బదులు వేరే విషయాలను నేర్చుకోవాలని సూచించాడు. ఈ ట్వీట్‌ పెట్టిన కొద్దిసేపటికే అభిమానుల నుంచి పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.