close

తాజా వార్తలు

సూపర్‌ఓవర్‌ తర్వాత బౌండరీలు కూడా టై అయితే..

పరిస్థితి ఏంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: నిర్ణీత ఓవర్ల క్రికెట్‌లో రెండు జట్లూ సమాన స్కోర్లు సాధించిన వేళ మ్యాచ్‌ టైగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో విజేతని ప్రకటించడానికి సూపర్‌ ఓవర్‌ విధానాన్ని అమలుచేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఆ సూపర్‌ ఓవర్‌లో ఎలాంటి నియమాలు అమలుచేస్తారో చాలా మందికి తెలియకపోవచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
* మ్యాచ్‌ టైగా మారిన సందర్భంలో ఇరు జట్లకూ ఒక్కొక్క ఓవర్‌ పాటు బ్యాటింగ్‌ చేసే అవకాశం ఇస్తారు. ఈ ఓవర్‌లో ఎవరు ఎక్కువ పరుగులు సాధిస్తే వారు విజేతగా నిలుస్తారు.
* మ్యాచ్‌లో ఎవరైతే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తారో సూపర్‌ ఓవర్‌లో ఆ జట్టే తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది.
* రెండు జట్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌తో పాటు ఒక్కో బౌలర్‌ని ఎంపిక చేస్తారు. అది కూడా ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లనే అనుమతిస్తారు.
* సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఏదైనా జట్టు రెండు వికెట్లు కోల్పోతే ఇక వారి ఇన్నింగ్స్‌ ముగిసినట్టే.
* ఫీల్డింగ్‌ విషయంలో మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో పాటించిన నియమాలనే సూపర్‌ ఓవర్‌లోనూ కొనసాగిస్తారు.
* డీఆర్‌ఎస్‌(డెసిషన్ రివ్యూ సిస్టమ్‌) విధానాన్ని కూడా అమలు చేస్తారు. రెండు జట్లకూ ఒక్కో సమీక్ష అందుబాటులో ఉంటుంది. 
* సూపర్‌ ఓవర్‌ విధానాన్ని తొలిసారి న్యూజిలాండ్‌ X వెస్టిండీస్‌ జట్ల మధ్య 2008లో జరిగిన టీ20 మ్యాచ్‌లో అమలుచేశారు. 
* ఐసీసీ మాత్రం ఈ విధానాన్ని 2011 ప్రపంచకప్‌ నాకౌట్‌ సమయంలో అమల్లోకి తెచ్చింది. ఈ విధానం అధికారికంగా అమల్లోకి వచ్చిన తర్వాత ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ సూపర్‌ ఓవర్‌ ఆడే అవకాశం గతంలో రాలేదు.

ఒకవేళ సూపర్‌ ఓవర్‌ కూడా టై అయితే?
సూపర్‌ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోర్లు సమానమైతే.. అప్పుడు మ్యాచ్‌లో ఎవరెక్కువ బౌండరీలు సాధిస్తే(సూపర్‌ ఓవర్‌తో కలిపి) వారిని విజేతగా ప్రకటిస్తారు. అలాగే ఆదివారం నాటి ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ (ప్రధాన ఇన్నింగ్స్‌ బౌండరీలు 24 + సూపర్‌ ఓవర్‌ బౌండరీలు 2=26) బౌండరీలు సాధించగా న్యూజిలాండ్ (ప్రధాన ఇన్నింగ్స్‌ బౌండరీలు 16+ సూపర్‌ ఓవర్‌ బౌండరీలు 1=17) బౌండరీలు సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఇంగ్లాండ్‌ జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఒకవేళ సూపర్‌ ఓవర్‌ టై అయి.. ఇరు జట్ల బౌండరీలు కూడా సమానమైతే అప్పుడేంటి పరిస్థితి. అప్పుడు సూపర్‌ ఓవర్‌లో బాదిన బౌండరీలను మినహాయించి ప్రధాన ఇన్నింగ్స్‌లో ఏ జట్టైతే బౌండరీలతో ఎక్కువ పరుగులు సాధిస్తుందో ఆ జట్టుని విజేతగా తేలుస్తారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.