close

తాజా వార్తలు

ఒకేఫైనల్‌.. రెండుసార్లు టై.. క్రేజీ.. ఊహించలేం

భారత్‌లో ప్రపంచకప్‌నకు న్యూజిలాండ్‌ ఫేవరెట్‌: వెటోరీ

లండన్‌: ఒక ఫైనల్‌ మ్యాచ్‌ రెండు సార్లు టై కావడం క్రేజీగా అనిపిస్తోందని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేనియెల్‌ వెటోరీ అన్నాడు. భారత్‌లో 2023లో జరిగే ప్రపంచకప్‌లో కివీస్‌ ఎందుకు ఫేవరెట్‌ కాకూడదని ప్రశ్నించాడు. ప్రస్తుత జట్టు అప్పటికి మరింత అనుభవం సాధిస్తుందని వెల్లడించాడు.

‘న్యూజిలాండ్‌ను చూస్తుంటే వచ్చే నాలుగేళ్లలో పెద్ద మార్పులేమీ ఉండవు. ఇప్పుడున్న ఆటగాళ్లే తర్వాత ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉంటారు. వారు అనుభవం సంపాదించి మరింత మెరుగై తిరిగొస్తారు. అలాంటప్పుడు భారత్‌లో టైటిల్‌ కోసం వీరు పోటీలో ఉండకపోవడానికి ఎలాంటి కారణాలు లేవు. ఈ ప్రపంచకప్‌లో కివీస్‌కు ట్రోఫీ రాకపోయినప్పటికీ అద్భుతమైన ప్రదర్శనతో వారు గర్వంగా ఇంటికి తిరిగొస్తారు. విజయం రెండు జట్లతో దోబూచులాడింది. ఆధిపత్యం సాంతం చేతులు మారింది’ అని వెటోరీ అన్నాడు.

‘ప్రపంచకప్‌ ఫైనల్లో అదీ లార్డ్స్‌లో రెండు సార్లు టై కావడం అస్సలు ఊహించలేం. ఆట ఆరంభం నుంచి ముగిసే వరకు ఉత్కంఠ ఊపేసింది. 102 ఓవర్లు ఊపిరి బిగపట్టాల్సి వచ్చింది. ఫలితం న్యూజిలాండ్‌కు హృదయ విదారకంగా ఉంటుంది. చివర్లో కేన్‌ విలియమ్సన్‌ భావోద్వేగాన్ని మనం గమనించొచ్చు. ఎంతో ఆవేదన చెందాడు. ఐతే కివీస్‌ ప్రదర్శన పట్ల గర్వపడాలి. ప్రపంచకప్‌ మొత్తం అద్భుతంగా ఆడింది. ఇంగ్లాండ్‌ను అనేందుకు ఏమీ లేదు. కొన్ని పరిణామాలు వారికి అనుకూలంగా చోటు చేసుకున్నాయి. కఠిన పరిస్థితుల్లో వారు నిలిచారు. వారి ఆటను తక్కువ చేయొద్దు. ఒక పరాజితగా కివీస్‌ను చూడొద్దు. వారి తెలివైన, అద్భుతమైన ఆటకు సంబరాలు చేసుకోవాలి. సవ్యంగా సాగిన విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి’ అని వెటోరీ తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.