close

తాజా వార్తలు

సింధు ముందుకు.. కిదాంబి ఇంటికి!

జకార్తా: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ముందడుగు వేసింది. గురువారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మియా (డెన్మార్క్‌)తో జరిగిన పోరులో 21-14, 17-21, 21-11తో విజయం సాధించింది. తొలి గేమ్‌ను కేవలం 18 నిమిషాల్లోనే సింధు 21-14తో కైవసం చేసుకుంది. రెండో గేమ్‌ను మాత్రం కోల్పోయింది. ఆఖరి గేమ్‌లో పుంజుకొని ఆడిన సింధు 21-11తో గెలుచుకొని టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. లాంగ్‌ ఆగ్నస్‌ (హాంకాంగ్‌)తో జరిగిన పోరులో 17-21, 19-21తో వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.