
తాజా వార్తలు
విలియమ్సన్తో పాటు నామినేట్ అయిన ఇంగ్లాండ్ క్రికెటర్
క్రైస్ట్‌చర్చ్: లార్డ్స్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ల్లో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్‌స్టోక్స్‌కు అరుదైన గౌరవం లభించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు ‘న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్’గా స్టోక్స్ నామినేట్ అయ్యాడు. బెన్‌స్టోక్స్ ఈ ప్రపంచకప్‌లో 66.42 సగటుతో 465 పరుగులు చేసి, ఏడు వికెట్లు సాధించాడు. ఇక కివీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 84 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా అవతరించడంలో ముఖ్య భూమిక పోషించాడు.
కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సూపర్ ఓవర్లోనూ సమం కావడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లిష్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయితే స్టోక్స్ న్యూజిలాండ్‌లో పుట్టిన నేపథ్యంలోనే అతడిని నామినేట్ చేయగా.. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు దీటుగా న్యూజిలాండ్‌ని ముందుకు తీసుకెళ్లిన సారథి కేన్విలియమ్సన్కు కూడా నామినేట్ చేశారు. వీరిద్దరితో పాటు న్యూస్టాక్ జెడ్బీ హోస్ట్ సైమన్ బార్నెట్, మాజీ లీగ్ స్టార్ మనూ వాటువీ, క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల ఘటన సందర్భంగా ధీరత్వం ప్రదర్శించిన రిపోర్టర్ అబ్దుల్ అజీజ్ కూడా నామినేట్ అయిన వారిలో ఉన్నారు.
అయితే ప్రపంచకప్ తర్వాత విలియమ్సన్, బెన్స్టోక్స్ల పేరిట అనేక నామినేషన్లు వచ్చాయని ‘న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్’ చీఫ్ జడ్జి కెమరాన్ బెన్నెట్ తెలిపారు. సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, డిసెంబర్లో పది మందితో తుది జాబితా విడుదల చేసి ఫిబ్రవరిలో విజేతని ప్రకటిస్తామని చెప్పారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- టీమిండియా సమష్టి విజయం
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
