Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 128827
            [news_title_telugu_html] => 

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఆలస్యమెందుకంటే?

[news_title_telugu] => హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఆలస్యమెందుకంటే? [news_title_english] => Why Kumble Dravid made it to Hall of Fame before Sachin [news_short_description] => అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న ఆరో భారత క్రికెటర్‌గా సచిన్‌ తెందుల్కర్‌ నిలిచారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ [news_tags_keywords] => Sachin Tendulkar,ICC Hall of Fame,Rahul Dravid,Anil Kumble,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-19 17:35:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఆలస్యమెందుకంటే? - Why Kumble Dravid made it to Hall of Fame before Sachin - EENADU
close

తాజా వార్తలు

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఆలస్యమెందుకంటే?

అందుకే ఆరో భారతీయ క్రికెటర్‌గా..

ముంబయి: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న ఆరో భారత క్రికెటర్‌గా సచిన్‌ తెందుల్కర్‌ నిలిచారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డొనాల్డ్‌, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌ కూడా తాజాగా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న క్రికెటర్ల సంఖ్య 87కి చేరింది. అత్యధికంగా ఇంగ్లాండ్‌ నుంచి 28 మంది క్రికెటర్లు, ఆస్ట్రేలియా నుంచి 25 మంది ఉండగా.. అత్యల్పంగా శ్రీలంక నుంచి ఒక్కరే ఇందులో స్థానం దక్కించుకున్నారు.   
రికార్డుల పరంగా సచినే టాప్‌..
200 టెస్టుల్లో 15921 పరుగులు.. అందులో 51 శతకాలు, 463 వన్డేల్లో 18426 పరుగులు.. 49 శతకాలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు లేనంత మెరుగైన రికార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ సొంతం. అయినా ప్రతిష్ఠాత్మక హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు స్థానం ఎందుకు ఆలస్యమైంది? సగటు క్రికెట్‌ అభిమాని మదిలో ఈ ప్రశ్న ఉండే ఉంటుంది. అందులోనూ అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత సచిన్‌ ఈ వరుసలో నిలవడానికి ఐసీసీ నిబంధనలే కారణం. 

నిబంధనలు ఇలా..
* బ్యాట్స్‌మెన్‌ అయితే వన్డేలు లేదా టెస్టుల్లో కనీసం 8వేల పరుగులు పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా 20 శతకాలు నమోదు చేసి ఉండాలి. సగటు 50కి పైనే ఉండాలి.
* బౌలర్ల విషయానికొస్తే 50 టెస్టులు, 30 వన్డేలు ఆడి కనీసం ఏదో ఒక ఫార్మాట్‌లో 200 వికెట్లు పడగొట్టి ఉండాలి. 
* అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తవ్వాలి.

అందుకే వారి తర్వాత మాస్టర్‌..
అనిల్‌ కుంబ్లే 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అతనికి 2015లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కింది. రాహుల్‌ ద్రవిడ్‌ 2012లో రిటైర్మెంట్‌ ప్రకటించడంతో 2018లో ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇక సచిన్‌ తెందుల్కర్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో తాజాగా ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా నిలిచారు. వీరి కంటే ముందు బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌(2009), కపిల్‌దేవ్‌(2009) భారత్‌ తరఫున ముందు వరుసలో ఉన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.