close

తాజా వార్తలు

సెమీస్‌కు చేరిన సింధు

జకార్తా: ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత స్టార్‌ పి.వి సింధు సెమీఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మహిళ సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు ప్రపంచ మూడో ర్యాంకర్‌ నోజోమి ఒకుహారా (జపాన్‌)ను ఓడించింది. కేవలం 44 నిమిషాల్లోనే ఆమె 21-14, 21-7 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. తొలి గేమ్‌లో 5-5తో ఆదిలో కష్టపడిన సింధు తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఒకుహారా అనవసర తప్పిదాలతో భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో తెలుగు అమ్మాయి తొలి గేమ్‌లో 21-14తో విజయం సాధించింది. రెండో గేమ్‌లో 11-6తో ఒకుహారా కొద్దిసేపు పోటీలో నిలిచింది. కానీ సింధు విజృంభించడంతో ఒకుహారా తర్వాత కేవలం ఒకే ఒక్క పాయింట్‌ మాత్రమే సాధించింది. దీంతో రెండో గేమ్‌ను 21-7తో ముగించిన సింధు మూడో గేమ్‌ ఆడకుండానే సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌, చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫేతో ఆమె శనివారం తలపడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.