
తాజా వార్తలు
ప్రపంచకప్ విజయంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
లండన్: ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల పోరాటపటిమ ఎంత చెప్పినా తక్కువే. బంతిబంతికీ ఉత్కంఠ రేపిన కీలక పోరులో రెండు జట్ల స్కోర్లు సూపర్ ఓవర్లోనూ సమం కావడంతో ఇంగ్లాండ్ జట్టు బౌండరీల సంఖ్య ఆధారంగా విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ ఫలితంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా దీనిపై స్పందించాడు.
ప్రపంచకప్ ఫైనల్స్‌లో రెండు జట్లూ అద్భుతంగా ఆడిన తర్వాత చాలా స్పల్ప తేడాతో ఇలాంటి ఫలితం రావడం సరైంది కాదనిపిస్తోందని మోర్గాన్ అన్నాడు. ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నాడు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్లకూ సమతూకంగా కొనసాగిందని వివరించాడు. ‘నేనిప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నా. అక్కడేం జరిగిందో నాకు తెలుసు, నేను అక్కడే ఉన్నాను. కానీ ఈ మ్యాచ్ ఫలితం పై వేలెత్తి చూపలేను. ఈ విజయం ఎలా ఉన్నా మ్యాచ్ ఓడిపోయుంటే మాత్రం చాలా తీవ్రంగా కలచివేసేది’ అని పేర్కొన్నాడు.
చివరగా ఇదో అద్భుతమైన మ్యాచ్‌గా సాగిందని, ఈ ఫలితం మాత్రం పిచ్చెక్కించిందని తెలిపాడు. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చిరునవ్వుతో ఓటమిని స్వీకరించగా అందరూ అతడిని ప్రశంసించారు. కివీస్ జట్టు కప్పు గెలవకపోయినా క్రికెట్ ప్రేమికుల అభిమానం గెలుచుకుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
