close

తాజా వార్తలు

తెలుగు టైటాన్స్‌.. ఆరంభ మ్యాచ్‌లోనే ప్చ్‌!

హైదరాబాద్‌: తెలుగు టైటాన్స్‌ ఆరంభ మ్యాచ్‌లోనే నిరాశ పరిచింది. ఏడో సీజన్‌ ప్రో కబడ్డీ లీగ్‌ తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలుపెట్టింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో 31-25తో తెలుగు టైటాన్స్‌ ఓడిపోయింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే యు ముంబా మ్యాచ్‌పై పట్టు సాధించింది. తెలుగు టైటాన్స్‌ను రెండు సార్లు ఆలౌట్‌ చేసి 24-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత నుంచి పుంజుకున్న టైటాన్స్‌.. యు ముంబా డిఫెన్స్‌ను ఛేదిస్తూ పాయింట్ల సంఖ్య పెంచుకోసాగింది. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో 31-25తో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. యు ముంబా ఆటగాళ్లలో అభిషేక్‌ సింగ్‌ 10 పాయింట్లు సాధించి ఆకట్టుకున్నాడు.

అదే వేదికగా బెంగళూరు బుల్స్‌, పట్నా పైరేట్స్‌ మధ్య మరో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో 34-32 తేడాతో బెంగళూరు బుల్స్‌ విజయం సాధించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.