close

తాజా వార్తలు

ఫైనల్లో సింధు ఓటమి

జకార్తా: ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి. సింధు ఓటమి పాలయింది. ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకోవాలనుకున్న సింధుకు నిరాశే మిగిలింది. జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగూచితో తలపడిన తుదిపోరులో 19-21, 16-21 తేడాతో తెలుగమ్మాయి ఓడింది. క్వార్టర్స్‌, సెమీస్‌లో అద్భుతంగా రాణించిన సింధు ఫైనల్లో 51 నిమిషాల్లోనే ప్రత్యర్థి ముందు తలవంచింది. తొలిగేమ్‌ ఆరంభంలో యమగూచి అదరగొట్టినా తెలుగమ్మాయి 11-8తో  గట్టి పోటీనిచ్చింది. కానీ తర్వాత ప్రత్యర్థి విజృంభించడంతో సింధు తొలిగేమ్‌ను దూరం చేసుకుంది. రెండోగేమ్‌లోనూ యమగూచి ఆధిపత్యం చెలాయించి  టైటిల్‌ను కైవసం చేసుకుంది. యమగూచిపై విజయాల రికార్డు ఉన్న సింధు ఫైనల్లో ఓడటం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.