close

తాజా వార్తలు

‘మహర్షి’పై వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమాను ఉద్దేశిస్తూ మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఓ ట్వీట్‌ చేశారు. సోమవారం తాను ఈ సినిమాను వీక్షించానని పేర్కొన్నారు. ‘ ‘మహర్షి’ సినిమా చూశాను. చాలా నచ్చింది. మనకు ఓ ముఖ్యమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన చిత్రమిది. మహేశ్‌ మరోసారి తన పవర్‌ఫుల్‌ నటనతో ఆకట్టుకున్నారు’ అని పేర్కొన్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకుంది. మూడు రోజుల్లోనే వంద కోట్లు రాబట్టి మహేశ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రను పోషించారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.