
తాజా వార్తలు
ట్విటర్లో స్క్రీన్ షాట్ల వైరల్
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ ప్రముఖ బ్యాట్స్మన్ ఇమామ్ ఉల్ హక్ అనేక మంది యువతుల్ని మోసం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడు యువతులతో ఛాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు ప్రస్తుతం ట్విటర్లో వైరల్గా మారాయి. పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తన స్టార్డమ్ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడని తెలుస్తోంది. తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని, ఇటీవల జరిగిన ప్రపంచకప్ సమయంలోనూ ఈ వ్యవహారాలను కొనసాగించాడని పేర్కొన్నాయి.
కాగా ఆ యువతులతో ఇమామ్ కొనసాగించిన ఛాటింగ్ విశేషాలు సైతం అనేక స్క్రీన్షాట్లు వెలుగులోకి వచ్చాయి. కొందరు అభిమానులు వీటిని కొట్టిపారేయగా మరికొందరు యువతులకు మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచకప్లో ఇమామ్ మంచి ప్రదర్శన చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత తలనొప్పిగా మారింది. ఈ వివాదంపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదవ్వలేదని సమాచారం. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు , ఇమామ్ ఉల్ హక్ వీటిపై స్పందించకపోవడం గమనార్హం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
