Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 134193
            [news_title_telugu_html] => 

భారత్‌లో టీమిండియాతో ఆడటం కష్టం

[news_title_telugu] => భారత్‌లో టీమిండియాతో ఆడటం కష్టం [news_title_english] => Toughest part is playing against India at World Test Championship says Faf du Plessis [news_short_description] => భారత్‌లో టీమిండియాతో టెస్టు క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ఆడటం తమకు కష్టతరమని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫా డు ప్లెసిస్‌ అన్నాడు. కోహ్లీసేన నెల రోజుల వెస్టిండీస్‌ పర్యటన అనంతరం... [news_tags_keywords] => Cricket, Faf du plessis,South Africa ,INDvsSA [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-30 11:50:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భారత్‌లో టీమిండియాతో ఆడటం కష్టం - Toughest part is playing against India at World Test Championship says Faf du Plessis - EENADU
close

తాజా వార్తలు

భారత్‌లో టీమిండియాతో ఆడటం కష్టం

టెస్టు ఛాంపియన్‌షిప్‌పై దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌

డర్బన్‌: భారత్‌లో టీమిండియాతో టెస్టు క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ఆడటం తమకు కష్టతరమని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ అన్నాడు. కోహ్లీసేన నెల రోజుల వెస్టిండీస్‌ పర్యటన అనంతరం సెప్టెంబర్‌ 15 నుంచి దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. భారత్‌తోనే ఆ జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభిస్తున్న సందర్భంగా దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మీడియాతో మాట్లాడారు.. ‘టెస్టు క్రికెట్‌ కోసం ఏదో చేయాలని ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆటగాళ్లకి ఇది కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. భారత్‌తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ జట్టుతో  టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆరంభించడం సవాలుగా నిలుస్తుంది. ప్రస్తుతం మా టెస్టు జట్టులో మంచి అనుభవమున్న ఆటగాళ్లు ఉన్నారు. కొందరు సీనియర్‌ ఆటగాళ్లు తప్పుకోనున్న నేపథ్యంలో ఇద్దరు లేదా ముగ్గురు యువకులు జట్టుతో కలుస్తారు’ అని డుప్లెసిస్‌ అన్నాడు.

‘ఇప్పుడు టెస్టు క్రికెట్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. మంచి వాతావరణంలో ఆట కొనసాగుతోంది. అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లూ టెస్టు క్రికెటే అత్యుత్తమైన క్రికెట్‌ అని భావిస్తారు. క్రికెట్‌ అభిమానులు కూడా ఈ ఆటని ఆస్వాదిస్తారు. ఎప్పటికైనా టెస్టు క్రికెటే చిరస్థాయిగా నిలుస్తుంది’ అని వివరించాడు.
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.