close

తాజా వార్తలు

యాషెస్‌: తొలి టెస్టుకు ఆర్చర్‌ దూరం

ఇంకా కోలుకోని ఇంగ్లాండ్‌ బౌలర్‌

ఎడ్జ్‌బాస్టన్‌: ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆసక్తిగా సాగే ఈ సిరీస్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ అందుకున్న నేపథ్యంలో ఆ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ప్రధాన బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఆడటం లేదని తాజా సమాచారం.

పక్కటెముకల నొప్పి కారణంగా గతవారం ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ ఆర్చర్‌ ఆడలేదు. అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో యాషెస్‌ తొలిటెస్టులో ఆడటం లేదని జట్టు వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రపంచకప్‌లో చెలరేగిన ఆర్చర్‌ మొత్తం 20 వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్లు స్కోర్లు సమమైన విషయం తెలిసిందే. ఆర్చర్‌ ఇంగ్లాండ్‌ తరఫున సూపర్‌ ఓవర్‌లో బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు.  

సూపర్‌ ఓవర్‌లో ఆర్చర్‌ 15 పరుగులు ఇవ్వగా ఆ స్కోరు కూడా న్యూజిలాండ్‌తో సమమైంది. దీంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. మెగా టోర్నీ ఆసాంతం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఆర్చర్‌. ప్రపంచకప్‌ తర్వాత పక్కటెముకల బాధతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే యాషెస్‌ తొలి టెస్టులో అతడు ఆడకపోవడం ఇంగ్లాండ్‌ జట్టుకు ప్రతికూలంగా మారింది. అయితే సీనియర్‌ బౌలర్‌ ఆండర్సన్‌ తమకు అండగా ఉన్నాడని ఇంగ్లాండ్‌ భావిస్తోంది. 

ఇంగ్లాండ్‌ జట్టు: రారీ బర్న్స్‌, జేసన్‌ రాయ్‌, జో రూట్‌(కెప్టెన్‌), జో డెన్లీ, జోస్‌ బట్లర్‌, బెన్‌స్టోక్స్‌, జానీ బెయిర్‌స్టో, మోయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, స్టువార్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.