close

తాజా వార్తలు

ఆ రోజులు చాలా దారుణంగా గడిచాయి

ప్రపంచకప్‌లో ఓటమిపై టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ

లౌడర్‌హిల్‌: ప్రపంచకప్‌లో టీమిండియా నిష్క్రమణపై కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ స్పందించాడు. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత కొన్ని రోజులు దారుణంగా గడిచాయని, ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. ప్రపంచకప్‌ ముగిసేవరకూ నిద్రలేచిన ప్రతీ ఉదయం ఆ పరాభవమే గుర్తొచ్చేదని, ఆ తర్వాత రోజు వారీ కార్యక్రమాల్లో పడి మర్చిపోవడానికి ప్రయత్నించామని చెప్పాడు. తాము అంతర్జాతీయ ఆటగాళ్లమని, జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించామని తెలిపాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

వెస్టిండీస్‌ పర్యటనకు ధోనీ లేకపోవడంపై స్పందిస్తూ అతడి అనుభవం టీమిండియాకి ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ధోనీ లేని లోటు యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌కు చక్కటి అవకాశమని కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్‌లో పంత్‌  రాణించాలని, అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు పంత్‌ కూడా సిద్ధంగా ఉన్నాడని, లోయర్‌ మిడిలార్డర్‌లో పంత్‌ తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని నిరూపించుకొని.. ధోనీ, పాండ్యలేని లోటును తీర్చాలని కోరాడు.

విండీస్‌ పర్యటనకు సెలక్టర్లు హార్దిక్‌పాండ్యకు విశ్రాంతినివ్వగా.. ధోనీ స్వతహాగా రెండు నెలలపాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు మంచి అవకాశం దొరికింది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో యువ క్రికెటర్లకు అవకాశమిచ్చామని కోహ్లీ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశం దక్కిన యువ క్రికెటర్లు ఈ పర్యటనలో బాగా ఆడాలనుకుంటున్నారని చెప్పాడు. నేటి నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో నెల రోజులపాటు తలపడనుంది. శనివారం, ఆదివారం రెండు టీ20 మ్యాచ్‌లు ఫ్లోరిడాలోని సెంట్రల్‌ బ్రోవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియంలో ఆడనుండగా.. ఈనెల 6న వెస్టిండీస్‌లో మూడో టీ20లో తలపడనుంది. ఆపై మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు అక్కడే ఆడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.