close

తాజా వార్తలు

లైయన్‌ పంజా:కంగారూలదే యాషెస్‌ తొలి టెస్టు

ఇంగ్లాండ్‌ 251 పరుగుల తేడాతో చిత్తు

బర్మింగ్‌హామ్‌: ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. కంచుకోట ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌ను 251 పరుగుల తేడాతో చిత్తుచేసింది. యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టును కైవసం చేసుకుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో నేథన్‌ లైయన్‌ (6/49) స్పిన్‌ పంజా, కమిన్స్‌ (4/32) పేస్‌దెబ్బకు ఆతిథ్య జట్టు విలవిల్లాడింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత బర్మింగ్‌హామ్‌లో కంగారూలు తొలి విజయం అందుకున్నారు.

ఆసీస్‌ నిర్దేశించిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 13/0తో ఐదో రోజు ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. జట్టు స్కోరు 19 వద్ద రోరీ బర్న్స్‌ (11)ను ఔట్‌ చేసి కమిన్స్‌ ఆతిథ్య జట్టు పతనాన్ని మొదలుపెట్టాడు. అయితే చరిత్రలో ఐదు రోజులు బ్యాటింగ్‌ చేసిన 10వ ఆటగాడిగా బర్న్స్‌ రికార్డు సృష్టించాడు. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (28)ని బౌల్డ్‌ చేసి లైయన్‌ వికెట్ల వేట మొదలుపెట్టాడు. భోజన విరామానికి ముందు 12 పరుగుల వ్యవధిలోనే నాలుగు కీలక వికెట్లు పోగొట్టుకొని ఇంగ్లిష్‌ జట్టు ఓటమి వైపు పయనించింది. 80 వద్ద జో డెన్లీ (11), 85 వద్ద జో రూట్‌ (28), జోస్‌ బట్లర్‌ (1), 97 వద్ద జానీ బెయిర్‌ స్టో (6), బెన్‌స్టోక్స్‌ (6) ఔటవ్వడంతో ఇంగ్లాండ్‌ 97/7తో నిలిచింది. విరామం తర్వాత క్రిస్‌వోక్స్‌ (37) మినహాయిస్తే మిగిలిన వారెవరూ పోరాడక పోవడంతో ఆ జట్టు 146 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్‌స్మిత్‌ (142) చేసిన పరుగుల కన్నా ఇంగ్లాండ్‌ నాలుగే ఎక్కువ చేయడం గమనార్హం.

స్కోరు వివరాలు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 284

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 374

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 487/7 డిక్లేర్‌

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 146 ఆలౌట్‌ (52.3 ఓవర్లకు)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.