Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 139362
            [news_title_telugu_html] => 

ఆమ్లా.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు

[news_title_telugu] => ఆమ్లా.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు [news_title_english] => Sachin Tendulkar and other cricketers tweets on Hashim Amla Retirement [news_short_description] => దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ఆమ్లా గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో పలువురు క్రికెటర్లు అతడికి రిటైర్మెంట్‌ అభినందనలు తెలిపారు... [news_tags_keywords] => Hashim Amla,South Africa ,Cricket ,Sachin Tendulkar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-09 23:53:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆమ్లా.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు - Sachin Tendulkar and other cricketers tweets on Hashim Amla Retirement - EENADU
close

తాజా వార్తలు

ఆమ్లా.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు

స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిటైర్మెంట్‌పై క్రికెటర్ల స్పందన

ముంబయి: దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ఆమ్లా గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో పలువురు క్రికెటర్లు అతడికి అభినందనలు తెలిపారు. ఆ జట్టు పేస్‌ బౌలర్‌ డేల్‌స్టెయిన్‌ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మూడు రోజులకే ఆమ్లా తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. కాగా ఆమ్లా అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా దేశవాళీ క్రికెట్‌ మాత్రం ఆడతానని స్పష్టం చేశాడు. మొత్తం 124 టెస్టులు ఆడిన అతడు 28 శతకాలతో 9282 పరుగులు చేశాడు. ఇక 181 వన్డేల్లో 27 శతకాలతో 8113 పరుగులు సాధించాడు. ఇటీవల ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన వన్డేనే ఆమ్లాకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌.

* ‘‘ఆమ్లా.. నీ దేశం తరఫున ఎంతో నిబద్ధతతో ప్రాతినిథ్యం వహించావు. నీ ఆటతీరుతో ఎంతో మంది యువకులకి స్ఫూర్తిగా నిలిచావు. ఇకపై నీ భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నా. నీకు అంతా మంచే జరగాలి మిత్రమా’’  -సచిన్‌ తెందూల్కర్‌

‘‘మా జట్టులో కీలకమైన ఆటగాడు. అద్భుత జ్ఞానం, మంచి వినయం అతడి సొంతం. ఎల్లప్పుడూ ముఖంపై చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాడు. నాకు తెలిసినంత వరకూ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్‌కు వెన్నెముకగా నిలిచావు. నీ ఆటకు కృతజ్ఞతలు’’ -ఫా డుప్లెసిస్‌

‘‘నమ్మశక్యం కాని కెరీర్‌ ఆమ్లాది! మొదట్లో నిన్నెవ్వరూ నమ్మలేదు. నీ పోరాటం, వినయం, అద్భుతమైన ఆటతో అత్యున్నత శిఖరానికి చేరుకున్నావు. అలాగే ప్రపంచ క్రికెట్‌లో మేటి క్రికెటర్లలో ఒకడిగా ఎదిగావు’’  - ఎబీ డివిలియర్స్‌

‘‘ఆమ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకొని క్రికెట్‌ ప్రేమికుల్ని ఆశ్చర్యపర్చాడు. అతడో లెజెండ్‌, అద్భుతమైన వ్యక్తి. క్రికెట్‌కే అంబాసిడర్‌గా నిలిచాడు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇకపై అంతా మంచే జరగాలి’’ -షోయబ్‌ అక్తర్‌

* ‘‘న్యూజిలాండ్‌లో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆమ్లాతో తొలిసారి ఆడాను. మా జట్టుపై అద్భుతంగా ఆడి తన క్లాస్‌ బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాకే రిటైర్మెంట్‌ ప్రకటించాడనిపిస్తోంది. సోదరా! నీకు రిటైర్మెంట్‌ శుభాకాంక్షలు’’ -ఇర్ఫాన్‌ పఠాన్‌

* ‘‘ఆమ్లా.. నేటి తరంలో అత్యుత్తమ క్రికెటర్‌. విజయవంతమైన నీ కెరీర్‌ పట్ల అభినందనలు. నీ జీవితంలో ఇకపై అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’   -మహ్మద్‌ కైఫ్‌

* ‘‘అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌ నిర్మించుకున్న ఆమ్లాకు అభినందనలు. 90వ దశకంలో కింగ్స్‌మేడ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా మొదటిసారి చూశా. అక్కడి నుంచి ఇక్కడి దాకా అమోఘమైన క్రికెటర్‌గా ఎదిగావు. చాలా బాగా ఆడావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.’’-షాన్‌పొలాక్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.