close

తాజా వార్తలు

అవును.! దాదా మాటలు అక్షరాలా నిజం

నేనూ అంగీకరిస్తున్నా: అజింక్య రహానె

ముంబయి: ఒక మంచి టెస్టు ఆటగాడు వన్డే, టీ20 మ్యాచుల్లో సులభంగా రాణించగలడని టీమిండియా క్రికెటర్‌ అజింక్య రహానె అన్నాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణించే ఆటగాళ్ల బృందం ఉండాల్సిన సమయం వచ్చేసిందని పేర్కొన్నాడు. భారత జట్టులో ఒక కోర్‌గ్రూప్‌ ఉండాలన్న సౌరవ్‌ గంగూలీ అభిప్రాయంతో అతడు ఏకీభవించాడు.

‘అన్ని ఫార్మాట్లు ఆడగల ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వన్డే జట్టులో శుభ్‌మన్‌గిల్‌, రహానె లేకపోవడం ఆశ్చర్యం. లయ, ఆత్మవిశ్వాసం కోసం అన్ని ఫార్మాట్లకు ఒకే క్రికెటర్లను ఎంపిక చేయాల్సిన సమయం భారత సెలక్టర్లకు వచ్చేసింది. కొద్దిమందే అన్ని ఫార్మాట్లు ఆడుతున్నారు. గొప్ప జట్లలో ఆటగాళ్లు నిలకడగా ఉంటారు. అందరినీ సంతోషంగా ఉంచడం కోసం కాదు. దేశం కోసం నిలకడగా, అత్యుత్తమంగా రాణించే జట్టును ఎంపిక చేయడం ముఖ్యం’ అని వెస్టిండీస్‌ పర్యటనకు ఆటగాళ్లను ఎంపిక చేసినప్పుడు గంగూలీ అన్నాడు. తన అభిప్రాయమూ ఇదేనని రహానె అంగీకరించాడు.

‘నిలకడగా ఆడటం అత్యంత కీలకం. ఒక కోర్‌గ్రూప్‌ ఉండటం మంచిదే. మూడు ఫార్మాట్లలో ఒకే కోర్‌గ్రూప్‌ ఉండటంపై దాదా మాట్లాడాడు. నేనెప్పుడూ దాన్నే నమ్ముతా. నిలకడ ఉన్నప్పుడు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకే కోర్‌గ్రూప్‌ ఉంటే ఆటగాళ్లపై జట్టు విశ్వాసం, నమ్మకం ఉంచుతోందని తెలుస్తుంది. పరిస్థితులకు సులభంగా అలవాటు పడి ఆటను ముందుకు తీసుకుపోగలరు. అంతర్జాతీయ క్రికెట్‌ను 3-4 నెలలకు ఓసారి ఆడితే కష్టంగా ఉంటుంది’ అని రహానె అన్నాడు.

‘ప్రస్తుత ఆటగాళ్లతో పోలిస్తే నా ఆటతీరు విభిన్నం. అయితే నేనెప్పుడు ఆటతో పాటే ఎదగడంపై దృష్టి సారిస్తా. ఒక్కోసారి ఒంటరిగా వెనకే నిలబడి పోవచ్చు. ఇప్పుడు టెస్టు మ్యాచ్‌ల రన్‌రేట్‌ సైతం కీలకంగా మారింది. అందుకే ఎవరి షాట్లు వారు ఆడాలి. ఒక ఆటగాడు టెస్టు క్రికెట్‌ను చక్కగా ఆడితే ఏ ఫార్మాటైనా ఆడగలడని నా నమ్మకం. ఆటగాడి టెక్నిక్‌ అద్భుతంగా ఉంటే అతడు టీ20, వన్డే క్రికెట్‌కు సులభంగా ఆడగలడు. అదే టీ20 క్రికెట్‌ నుంచి టెస్టులకు వస్తే షాట్లపై నియంత్రణ ఉండదు. నేనెప్పుడూ నిలకడనే నమ్ముతా. నిలకడే కీలకం. ఒక ఆటగాడికి జట్టు అండగా నిలిస్తే నిలకడగా అతడితోనే ఉండాలి’ అని జింక్స్‌ వెల్లడించాడు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.