Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142229
            [news_title_telugu_html] => 

ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం

[news_title_telugu] => ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం [news_title_english] => India won by 6 wickets [news_short_description] => సారథి విరాట్‌ కోహ్లీ(114*; 99 బంతుల్లో 14×4) మరో శతకంతో మెరవగా, యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(65; 41బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకంతో చెలరేగిన వేళ.. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో [news_tags_keywords] => ind vs wi,kohli,gayle,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 03:49:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం - India won by 6 wickets - EENADU
close

తాజా వార్తలు

ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వన్డే సిరీస్‌ కూడా టీమిండియాదే. సారథి విరాట్‌ కోహ్లీ(114*; 99 బంతుల్లో 14×4) మరో శతకంతో మెరవగా, యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(65; 41బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకంతో చెలరేగిన వేళ.. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌(72; 41బంతుల్లో 8×4, 5×6), లూయిస్‌(43; 29బంతుల్లో 5×4, 3×6) మెరిపించారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోహ్లీసేన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైంది.

వరుణుడి ఇన్నింగ్స్‌ ఇలా..
మూడో వన్డేనూ వర్షం వెంటాడింది. వాన వస్తూ ఆగుతూ ఉండడంతో చాలా ఆట వృథా అయింది. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగి రెండు ఓవర్లు ముగిసేలోపే వరుణుడు ఆట మొదలైంది. మళ్లీ కాస్త విరామం తర్వాత 22 ఓవర్‌లో మరోసారి వానదేవుడు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అప్పటికి విండీస్‌ స్కోరు 158/2. అప్పటి నుంచి వరుణుడు దోబూచులాడుతూ చాలా సమయాన్ని వృథా చేశాడు. దీంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. 35 ఓవర్లలో వెస్టిండీస్‌ 7 వికెట్లు కోల్పోయి 240 పరుగులు సాధించింది. 

రోహిత్‌ రనౌట్‌..
లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ ఆరంభంలోనే రోహిత్‌(10) వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌లో రెండు బౌండరీలు బాది ఊపు మీదున్న హిట్‌మ్యాన్‌.. మూడో ఓవర్‌లో లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ ధావన్‌(36; 36బంతుల్లో 5×4)తో కలిసి సారథి కోహ్లీ ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చాడు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఈ జోడీ కుదురుకున్నట్లే కనిపించింది. కానీ 13వ ఓవర్‌లో అలెన్‌ బౌలింగ్‌లో ధావన్‌ అనవసరపు షాట్‌ ఆడి కీమో పాల్‌ చేతికి చిక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన పంత్‌(0) కూడా అదే ఓవర్‌లో నాలుగో బంతికి చెత్త షాట్‌ ఆడి కీమో పాల్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికి స్కోరు 92/3.

మళ్లీ వాళ్లిద్దరే..
ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ-శ్రేయస్‌ జోడీదే ఆటంతా. అప్పటికే కీలక మూడు వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో ఉన్న భారత్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ఇద్దరూ చక్కటి సమన్వయంతో జోరు సాగించారు. శ్రేయస్‌ వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ ఆకట్టుకున్నాడు. 26వ ఓవర్‌లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ మరో 15 పరుగులు జోడించి రోచ్‌ బౌలింగ్‌లో హోల్డర్‌ చేతికి చిక్కాడు. వీరిద్దరూ కలిసి కీలక 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

కోహ్లీ @43 
విరాట్‌ శతకాల పరంపర మళ్లీ మొదలైంది. మూడో వన్డేలోనూ సెంచరీ సాధించి వన్డేల్లో 43 శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ వచ్చిన కోహ్లీ చక్కటి షాట్లతో అలరించాడు. ఎక్కడా ఇబ్బందికి గురికాకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. శ్రేయస్‌ ఔట్‌ అయ్యాక క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌(19; 12బంతుల్లో 1×4, 1×6)తో కలిసి మరో వికెట్‌ పడకుండా బ్రాత్‌వైట్‌ వేసిన 33వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 

* వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ(21సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌(22) ఉన్నాడు. 
* ఒక జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ(9- వెస్టిండీస్‌పై), సచిన్‌(9-ఆస్ట్రేలియాపై) సరసన నిలిచాడు. 

ఓపెనర్ల మెరుపులు..
టాస్‌ గెలిచి విండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు ఆరంభంలో జాగ్రత్తగా ఆడారు. తొలి నాలుగు ఓవర్లలో స్కోరు 13 పరుగులే. కానీ ఐదో ఓవర్‌ నుంచి మోత మొదలైంది. మొదట బ్యాట్‌ ఝళిపించింది లూయిస్‌. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో అతడు రెండు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ తర్వాత గేల్‌ గేర్‌ మార్చాడు. తన తొలి 16 బంతుల్లో 10 పరుగులే చేసిన అతడు.. షమి ఓవర్లో ఓ సిక్స్‌, మూడు ఫోర్లు దంచాడు. అదే జోరు కొనసాగించాడు. గేల్‌, లూయిస్‌ ధాటికి ఖలీల్‌ తన తొలి రెండు ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకున్నాడు. గేల్‌ కేవలం 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకోగా.. విండీస్‌ 10 ఓవర్లలో 114/0తో అత్యంత బలమైన స్థితిలో నిలిచింది. 11వ ఓవర్లో లూయిస్‌ను చాహల్‌ ఔట్‌ చేయడంతో ఎట్టకేలకు తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. భారత్‌ ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే గేల్‌ను ఖలీల్‌ వెనక్కి పంపాడు. ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది. హెట్‌మైయర్‌(25), షై హోప్‌(24) ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చారు. కానీ 22వ ఓవర్‌లో వరుణుడు మళ్లీ వచ్చాడు. సుమారు రెండు గంటల వరకూ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత భారత బౌలర్లు పిచ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. హెట్‌మైయర్‌, హోప్‌ను వెంటవెంటనే ఔట్‌ చేసి కట్టడి చేశారు. భారీ షాట్లతో ధాటిగా ఆడుతున్న పూరన్‌(22)ను కూడా షమి బోల్తా కొట్టించాడు. బ్రాత్‌వైట్‌(16) బ్యాట్‌ ఝళిపించి విండీస్‌ ఇన్సింగ్స్‌ను నిలబెట్టాడు. భారత బౌలర్లలో ఖలీల్‌ మూడు వికెట్లు, షమి రెండు వికెట్లు పడగొట్టారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.