Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142984
            [news_title_telugu_html] => 

రవిశాస్త్రికే పట్టం కట్టిన కపిల్‌దేవ్‌

[news_title_telugu] => రవిశాస్త్రికే పట్టం కట్టిన కపిల్‌దేవ్‌ [news_title_english] => Ravi Shastri reappointed head coach of Indian team [news_short_description] => టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి నియామకం అయ్యారు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ ఆయనకే మొగ్గు చూపింది. భారత్‌లో 2021 వరకు జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు ఆయన... [news_tags_keywords] => Ravi shastri,kapil dev,bcci,Team India coach [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 18:35:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రవిశాస్త్రికే పట్టం కట్టిన కపిల్‌దేవ్‌ - Ravi Shastri reappointed head coach of Indian team - EENADU
close

తాజా వార్తలు

రవిశాస్త్రికే పట్టం కట్టిన కపిల్‌దేవ్‌

2021 టీ20 ప్రపంచకప్‌ వరకు పదవిలో కొనసాగనున్న శాస్త్రి 

ముంబయి: అనుకున్నదే జరిగింది. టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి నియామకం అయ్యారు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ ఆయనకే మొగ్గు చూపింది. కమిటీ సభ్యులు అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామి భారతీయ కోచ్‌కే ఓటు వేశారు. భారత్‌లో 2021 వరకు జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు శాస్త్రి ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన జాతీయ జట్టుతో కలవడం ఇది నాలుగో సారి. తొలుత క్రికెట్‌ మేనేజర్‌ (బంగ్లాదేశ్‌ పర్యటన-2007)గా, రెండోసారి టీమిండియా డైరెక్టర్‌ (2014-16)గా, మూడోసారి (2017-2019) కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

టీమిండియా మాజీ ఆటగాళ్లు రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీతో పోటీలో రవిశాస్త్రి గెలిచారు. విండీస్‌ మాజీ క్రికెటర్‌, అఫ్గాన్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. ‘పోటీలో మూడో స్థానంలో టామ్‌ మూడీ, రెండో స్థానంలో మైక్‌ హెసన్‌ నిలిచారు. మీరంతా అనుకున్నట్టుగా రవిశాస్త్రి అగ్రస్థానంలో ఉన్నారు. పోటీ మాత్రం చాలా హోరాహోరీగా సాగింది’ అని కపిల్‌దేవ్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

సారథి విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి మధ్య మంచి సమన్వయం ఉంది. వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరే ముందు కోచ్‌గా రవిభాయ్‌ను కొనసాగిస్తే బాగుంటుందని విరాట్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడే శాస్త్రి ముందంజలో ఉన్నారని అందరికీ తెలిసిపోయింది. ఆయన నేతృత్వంలో భారత జట్టు టెస్టుల్లో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. 71 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీసులు గెలుచుకుంది. ఐతే 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీసుల్లో ఓటమి పాలవ్వడమే కాస్త బాధాకరం. అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామి, కపిల్‌దేవ్‌ దీనిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. అనిల్‌ కుంబ్లే తర్వాత 2017, జులైలో కోచ్‌గా వచ్చిన శాస్త్రి ఆధ్వర్యంలో టీమిండియా 21 టెస్టుల్లో 13 గెలిచింది. 60 వన్డేల్లో 43, 36 టీ20ల్లో 25 విజయాలు కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో, 2021లో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్పుల్లో జట్టును శాస్త్రి ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూడాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.