Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143015
            [news_title_telugu_html] => 

శాస్త్రిలో కపిల్‌ కమిటీకి ఏం నచ్చింది?

[news_title_telugu] => శాస్త్రిలో కపిల్‌ కమిటీకి ఏం నచ్చింది? [news_title_english] => what are the key differences amog the team India coah prosprects [news_short_description] => భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక ప్రక్రియ ముగిసింది. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ రవిశాస్త్రికే తిరిగి పట్టం కట్టింది. 2,021 వరకు అవకాశం ఇచ్చింది. టీమిండియా మేనేజర్‌, జట్టు డైరెక్టర్‌, కోచ్‌గా ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. శాస్త్రి మార్గనిర్దేశంలోనే 2015, 2019 వన్డే ...... [news_tags_keywords] => ravi shastri,virat kohli,kapil dev,bcci,coach [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 21:13:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శాస్త్రిలో కపిల్‌ కమిటీకి ఏం నచ్చింది? - what are the key differences amog the team India coah prosprects - EENADU
close

తాజా వార్తలు

శాస్త్రిలో కపిల్‌ కమిటీకి ఏం నచ్చింది?

రవిశాస్త్రి అనుకూలతలు ఏంటీ? మార్కుల్లో తేడా ఎంత?

కమిటీ సభ్యులు చెప్పిన సమాధానాలు ఏంటీ?

ముంబయి

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక ప్రక్రియ ముగిసింది. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ రవిశాస్త్రికే తిరిగి పట్టం కట్టింది. 2021 వరకు అవకాశం ఇచ్చింది. టీమిండియా మేనేజర్‌, జట్టు డైరెక్టర్‌, కోచ్‌గా ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. శాస్త్రి మార్గనిర్దేశంలోనే 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీసుల్లో జట్టు నిష్ర్కమణపై విమర్శలు  చెలరేగినప్పటికీ కమిటీ ఆయనలో అసలేం చూసింది? ఎందుకు ఆయనకే ఓటేసింది?మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఆయనలో భిన్నం ఏంటీ? అనుకూలతలు ఏంటీ? ఎంపికలో అసలు విరాట్‌ కోహ్లీ ప్రభావమెంత?ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలని ఉందా!!


కోహ్లీ ప్రభావం ‘0’!

కోచ్‌ ఎంపిక ప్రక్రియపై విరాట్‌ కోహ్లీ ప్రభావమేమీ లేదు. అతడికా అవకాశమే ఇవ్వలేదని కపిల్‌ తెలిపారు. ‘మేం విరాట్‌ అభిప్రాయం తీసుకుంటే మొత్తం జట్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే మేం ఎవ్వర్నీ ఏమీ అడగలేదు. అందుకు ఆస్కారమే లేదు. తుది నిర్ణయంపై కోహ్లీ ప్రభావం లేనే లేదు. మేమంతా ఏకగ్రీవంగా రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశాం’ అని ఆయన అన్నారు.


సెమీస్‌ నిష్ర్కమణలపై

రవిశాస్త్రి నేతృత్వంలోనే వరుస ప్రపంచకప్‌ సెమీసుల్లో టీమిండియా నిష్ర్కమణపై కపిల్‌ భిన్నంగా స్పందించారు. ‘ఒక జట్టు ప్రపంచకప్‌ గెలవకపోతే మేనేజర్‌ను తొలగించాలా?లేదు. మొత్తం పరిస్థితిని పరిశీలించాలి. మేం దాన్ని పట్టించుకోలేదు. ఆయన ప్రజెంటేషన్‌ మాత్రమే చూశాం. ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత టామ్‌ మూడీ మూడులో, మైక్‌ హెసన్‌ రెండులో నిలిచారు. రవిశాస్త్రి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు’ అని ఆయన వెల్లడించారు.


ఏ అంశానికి ఎన్ని  మార్కులు

‘ముగ్గురి మధ్య మార్కుల తేడా అత్యంత స్వల్పం. ఐదు విభాగాల్లో వారికి మార్కులు వేశాం. అవి కోచింగ్‌ తత్వం, అనుభవం, విజయాలు, కమ్యూనికేషన్‌, ఆధునిక టూల్స్‌పై విజ్ఞానం. చాలా బాగుందికి 20, బాగుందికి 15, ఫర్వాలేదుకు 10, బాగా లేదుకు 5 మార్కులిచ్చాం. నిజాయతీగా చెబుతున్నా. ఎవరెన్ని మార్కులు వేశామో చర్చించలేదు. అన్నీ లెక్క చేసినప్పుడు ముగ్గురి మధ్యన తేడా చాలా చాలా తక్కువ’ అని హరియాణా హరికేన్‌ తెలిపారు.


అదే భిన్నం

‘అభ్యర్థులంతా బాగున్నారు. కమ్యూనికేషన్‌ నైపుణ్యాల్లో శాస్త్రి అద్భుతంగా ఉన్నాడని కొన్ని సందర్భాల్లో నాకు తోచింది. ఎంపికలో అదే కీలకంగా మారింది. ఇతర సభ్యులు ఈ విషయంలో భిన్న దృక్పథంతో ఉండొచ్చు. దాని గురించి మేం చర్చించలేదు. అందరి ప్రజెంటేషన్లు చూసిన తర్వాతే మార్కులు ఇచ్చాం. ప్రజెంటేషన్‌ కోసం వారెంత కష్టపడ్డారో గమనించాం’ అని కపిల్‌ పేర్కొన్నారు.


శాస్త్రి ప్రజెంటేషన్‌లో ఏముంది?

రవిశాస్త్రి ఒప్పందానికి సంబంధించిన పరిమితులు, షరతులు, జీతభత్యాల గురించి తెలియదని కపిల్‌ స్పష్టం చేశారు. గత ప్రదర్శనలు కాకుండా భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అభ్యర్థులు ఇచ్చిన ప్రజెంటేషన్ల ఆధారంగా కోచ్‌ను ఎంపిక చేశామన్నారు. వీడియో కాల్‌ ద్వారా ఆంటిగ్వా నుంచి రవిశాస్త్రి ప్రజెంటేషన్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ‘ప్రజెంటేషన్‌ వివరాలు రహస్యం. రెండేళ్లలో అతడేం సాధించాడు? మున్ముందు జట్టు మెరుగయ్యేందుకు ఏం చేయనున్నాడో శాస్త్రి వివరించాడు. రాబోయే రోజుల్లో టీమిండియాను పటిష్ఠం చేసేందుకు బోర్డును అతడు మరింత సమయం కోరాడు’ అని కపిల్‌ చెప్పారు.


శాస్త్రి అనుకూలత

‘ఆటగాళ్ల గురించి బాగా తెలుసుండి అద్భుతంగా మాట్లాడగలగడం అభ్యర్థులకు అనుకూల అంశం. ప్రస్తుత కోచ్‌గా రవిశాస్త్రికి జట్టు సభ్యుల గురించి బాగా తెలుసు. జట్టులో సమస్యలపై అవగాహన ఉంది. పరిష్కారానికి ఏం చేయాలో తెలుసు. వ్యవస్థ మొత్తంపై అద్భుతమైన అవగాహన ఉంది. ఈ మూడు అంశాల్లో పరిజ్ఞానమే శాస్త్రి అనుకూలత. ఇక ఎంపిక ప్రక్రియంతా పారదర్శకంగా సాగింది’ అని కమిటీ సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ తెలిపారు.


పరిగణనలోకి అనుభవం

‘భారత జట్టును ముందుకెలా నడిపించాలన్న దానిపై అభ్యర్థులంతా ప్రజెంటేషన్లు ఇచ్చారు. వారి గత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకున్నాం. ఆ విషయంలో రవిశాస్త్రికి అనుకూలంగా ఎక్కువ మార్కులు వచ్చాయి’ అని కమిటీ సభ్యురాలు శాంతా రంగస్వామి వెల్లడించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.