Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143012
            [news_title_telugu_html] => 

భారత్‌తో పోరుకు రంగంలోకి దిగిన లారా

[news_title_telugu] => భారత్‌తో పోరుకు రంగంలోకి దిగిన లారా [news_title_english] => Brian Lara to work with West Indies batsmen before India Tests [news_short_description] => భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విండీస్ యువ ఆటగాళ్లను సన్నద్ధం చేసేందుకు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా, రామ్‌నరేశ్‌ సర్వాన్‌ [news_tags_keywords] => Brian Lara,West Indies,India,Ramnaresh Sarwan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:30:25 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భారత్‌తో పోరుకు రంగంలోకి దిగిన లారా - Brian Lara to work with West Indies batsmen before India Tests - EENADU
close

తాజా వార్తలు

భారత్‌తో పోరుకు రంగంలోకి దిగిన లారా

ఆంటిగ్వా: భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విండీస్ యువ ఆటగాళ్లను సన్నద్ధం చేసేందుకు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా, రామ్‌నరేశ్‌ సర్వాన్‌ బరిలోకి దిగనున్నారు. రెండు జట్లకు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఈ సిరీస్‌తోనే ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తమ జట్టును పటిష్ఠం చేయడానికి లారా, రామ్‌నరేశ్‌.. వారి అనుభవం, నైపుణ్యం, పరిజ్ఞానాన్ని టెస్టు జట్టుతో పంచుకోనున్నారని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు డైరక్టర్‌ జిమ్మీ ఆడమ్స్‌ పేర్కొన్నారు.

‘జట్టులో నైపుణ్యమున్న యువ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. భవిష్యత్‌లో వెస్టిండీస్‌ క్రికెట్‌కు వారు కీలకంగా మారుతారు. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో మాకు మంచి ఫలితాలు దక్కాయి. టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను ఓడించాం. క్రికెట్‌లో మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నాం. యువ ఆటగాళ్లకు వారి అనుభవ పాఠాలు నేర్పించాలని లారా, రామ్‌నరేశ్‌ను కోరాం. వెస్టిండీస్‌ క్రికెట్‌పై వారికి మమకారం ఉందని మాకు తెలుసు. యువ ఆటగాళ్లతో వారి అనుభవం, నైపుణ్యం, పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు’ అని ఆడమ్స్ వెల్లడించారు. 

వెస్టిండీస్‌తో భారత్‌ రెండు టెస్టులను ఆడనుంది. ఆంటిగ్వాలో తొలి టెస్టు ఆగస్టు 22న, జమైకాలో రెండో టెస్టు ఆగస్టు 30న ప్రారంభం కానున్నాయి. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0, వన్డే సిరీస్‌ను 2-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.