Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143386
            [news_title_telugu_html] => 

రవిశాస్త్రికి మైక్‌ హెసన్‌ అభినందనలు

[news_title_telugu] => రవిశాస్త్రికి మైక్‌ హెసన్‌ అభినందనలు [news_title_english] => Ravi Shastri reply to Mike Hesson for Congratulations on reappointment of Team India Coach [news_short_description] => టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సందర్భంగా ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ అభినందనలు తెలిపాడు... [news_tags_keywords] => Ravi Shastri ,Team India Coach ,Team India ,BCCI,Virat Kohli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 15:32:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రవిశాస్త్రికి మైక్‌ హెసన్‌ అభినందనలు - Ravi Shastri reply to Mike Hesson for Congratulations on reappointment of Team India Coach - EENADU
close

తాజా వార్తలు

రవిశాస్త్రికి మైక్‌ హెసన్‌ అభినందనలు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సందర్భంగా ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ అభినందనలు తెలిపాడు. ట్విటర్‌ ద్వారా ‘టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా తిరిగి ఎంపికైనందుకు రవిశాస్త్రికి అభినందనలు. రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నాడు. ఇందుకు శాస్త్రి బదులిస్తూ.. ‘వెయ్యి ధన్యవాదాలు, మైక్‌. మీ శుభాకాంక్షలకు అభినందనలు. మీ కోచ్‌ బాధ్యతలను అలాగే కొనసాగించండి’ అని రీట్వీట్‌ చేశాడు.

కపిల్‌దేవ్‌ అధ్యక్షతన అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిల క్రికెట్‌ సలహా కమిటీ శుక్రవారం ముంబయిలోని బీసీసీఐ కార్యాయంలో కోచ్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. దాదాపు రెండు వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా వారిలో ఆరుగురినీ మాత్రమే ముఖాముఖీకి ఆహ్వానించారు. రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ తుది జాబితాకు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో సిమన్స్‌ ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడంతో మిగతావారినే ఇంటర్వ్యూ చేసి.. అందులో రవిశాస్త్రిని కోచ్‌గా ప్రకటించారు. 

కాగా రవిశాస్త్రి పేరు ప్రకటించిన సందర్భంలో కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ.. మైక్‌ హెసన్‌ స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిచిచాడని, అతడు రవిశాస్త్రికి గట్టి పోటీ ఇచ్చాడని పేర్కొన్నాడు. ఇక టామ్‌ మూడీ మూడో స్థానంలో నిలిచాడని తెలిపాడు. ఇప్పుడు ఎంపికైన రవిశాస్త్రి మరో రెండేళ్లు.. అంటే 2021 టీ20 ప్రపంచకప్‌ వరకూ కొనసాగుతాడని కపిల్‌ అన్నాడు. కోచ్‌ ఎంపిక ప్రక్రియలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అభిప్రాయం తీసుకోలేదని, పారదర్శంగానే ఈ ఇంటర్వ్యూలను పూర్తిచేసి అందులో ఎక్కువ మార్కులు వచ్చిన శాస్త్రీనే కోచ్‌గా తిరిగి ఎంపిక చేశామని మాజీ కెప్టెన్‌ వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.