Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143389
            [news_title_telugu_html] => 

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అనూహ్య నిర్ణయం!

[news_title_telugu] => ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అనూహ్య నిర్ణయం! [news_title_english] => England Captain Eoin Morgan feels like to setp down the captaincy [news_short_description] => పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి కెప్టెన్‌గా తప్పుకునే అవకాశముందని ఇంగ్లాండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ పేర్కొన్నాడు. ఇటీవల బీబీసీతో మాట్లాడుతూ అతడు ఈ విషయాన్ని... [news_tags_keywords] => Cricket ,Eoin Morgan ,England [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 10:11:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అనూహ్య నిర్ణయం! - England Captain Eoin Morgan feels like to setp down the captaincy - EENADU
close

తాజా వార్తలు

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అనూహ్య నిర్ణయం!

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా?

లండన్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా తప్పుకునే అవకాశముందని ఇంగ్లాండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ పేర్కొన్నాడు. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రపంచకప్‌ లీగ్‌ దశలో గాయం బారిన పడిన మోర్గాన్‌ తర్వాత కోలుకొని అఫ్గానిస్థాన్‌పై చెప్పుకోదగ్గ శతకం బాదాడు. జట్టుని ముందుండి నడిపించడంతో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సరైన ప్రణాళికతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు దశాబ్దాల ఇంగ్లాండ్‌ కలను సాకారం చేసి తొలిసారి ఆ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. తనపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, అయితే కెప్టెన్సీ బాధ్యతలను కొనసాగించాలా? వద్దా? అనే విషయాలపై ఆలోచించాల్సి ఉందని చెప్పాడు.

‘ఇది శారీరక శ్రమ. నేను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి కాస్త సమయం పడుతుంది. ఇంగ్లాండ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం పెద్ద బాధ్యత. నాకు తప్పుకోవాలని ఉన్నా.. అది చాలా పెద్ద నిర్ణయంగా మారింది. ప్రస్తుత కాలం త్వరగా గడిస్తే పూర్తిగా కోలుకుంటాను. అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రపంచకప్‌ సమయంలో నేను పూర్తిస్థాయిలో సాధన చేయలేకపోయా. ఒక జట్టుకు నాయకుడిగా ఉన్నప్పుడు ముందుండి నడిపించాలి. అదే మనల్ని ముందుకు తీసుకెళుతుంది’ అని మోర్గాన్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.