Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143517
            [news_title_telugu_html] => 

...రాబోయే 26 నెలల్లో రవిశాస్త్రి ఏం చేస్తారంటే!

[news_title_telugu] => ...రాబోయే 26 నెలల్లో రవిశాస్త్రి ఏం చేస్తారంటే! [news_title_english] => Ravi Shastris vision as team india coach [news_short_description] => టీమిండియా కోచ్‌ ఎంపిక ప్రక్రియ ముగిసింది. తన దార్శనికత, మాటకారితనంతో సలహా కమిటీని ఆకట్టుకున్న రవిశాస్త్రికే మళ్లీ అవకాశం దక్కింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన జట్టును 2020, 2021 టీ20 ప్రపంచకప్పుల్లో ఆయనెలా నడిపిస్తారన్నది ఆసక్తికరం....... [news_tags_keywords] => Ravi shastri,kapil dev,Team India,coach,bcci [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1162647093577601024 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 17:33:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
...రాబోయే 26 నెలల్లో రవిశాస్త్రి ఏం చేస్తారంటే! - Ravi Shastris vision as team india coach - EENADU
close

తాజా వార్తలు

...రాబోయే 26 నెలల్లో రవిశాస్త్రి ఏం చేస్తారంటే!

కపిల్‌ కమిటీకి శాస్త్రి ధన్యవాదాలు

బలమైన వారసత్వం నెలకొల్పుతాం

టీమిండియా కోచ్‌ ఎంపిక ప్రక్రియ ముగిసింది. తన దార్శనికత, మాటకారితనంతో సలహా కమిటీని ఆకట్టుకున్న రవిశాస్త్రికే మళ్లీ అవకాశం దక్కింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన జట్టును 2020, 2021 టీ20 ప్రపంచకప్పుల్లో ఆయనెలా నడిపిస్తారన్నది ఆసక్తికరం! కోచ్‌గా రెండో దఫాలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్ని పటిష్ఠం చేయడంతో పాటు భారత క్రికెట్‌లో తిరుగులేని వారసత్వం నెలకొల్పుతానని శాస్త్రి శపథం చేస్తున్నారు. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే...


నా ఆకాంక్ష

టీమిండియా నిలకడను మరో స్థాయికి తీసుకెళ్లడమే రాబోయే 26 నెలల్లో నా పని. నాపై విశ్వాసం ఉంచి తిరిగి కోచ్‌గా ఎంపిక చేసిన కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి క్రికెట్‌ సలహా కమిటీకి ధన్యవాదాలు. భారత జట్టులో భాగమవ్వడం నాకు గౌరవం. గర్వకారణం. ఈ జట్టుపై విశ్వాసం ఉంది కాబట్టే నేను తిరిగొచ్చాను. గతంలో కొన్ని జట్ల మాదిరిగా ఈ జట్టు ఓ బలమైన వారసత్వం నెలకొల్పుతుందన్న నమ్మకం నాకుంది. బాగా ఆడటమే కాదు భవిష్యత్తు తరాలు కొనసాగించేలా వారి వారసత్వం ఉండాలి. అదే నా ఆకాంక్ష. మేం ఆ దారిలోనే ఉన్నాం. మెరుగయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. యువతరం రంగప్రవేశం చేస్తోంది కాబట్టి ఎంతో ఆత్రుతగా ఉంది.


నా ప్రయత్నం

యువరక్తంతో భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే పటిష్ఠ జట్టును రూపొందించడమే నా పని. ఆ సవాల్‌ను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఫర్‌ఫెక్ట్‌ కాదు. ప్రావీణ్యం కోసం పరితపించినప్పుడు, పరిమితులను అధిగమించేందుకు పగలూ రాత్రీ కష్టపడ్డప్పుడు, ప్రతిదానిపై నిశితమైన దృష్టి ఉంచినప్పుడు అది సాధ్యమవుతుంది. ఒకానొక రోజు విఫలమైనంత మాత్రాన అక్కడేతోనే ఆగిపోవద్దు. ఆ అడ్డుగోడను బద్ధలు కొట్టేందుకు చేయాల్సిన పనిపై శ్రద్ధ పెట్టాలి. అదే ఈ జట్టు ప్రయత్నం.


కూర్పు కోసమే

టీమిండియా అత్యంత నిలకడగా ఆడుతోంది. ఈ రెండు మూడేళ్ల ప్రదర్శన చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆటగాళ్లు ఒక పరిమితి నిర్దేశించుకున్నారు. ఇప్పుడా పరిమితిని మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు ఫలితాలు బాగున్నప్పటికీ ఏది అత్యుత్తమ కూర్పో తెలుసుకోలేం. అందుకే యువతను తీర్చిదిద్దేందుకు సమయం పెట్టాలి. అన్ని విభాగాలు పటిష్ఠంగా ఉండేలా కూర్పు తెచ్చుకోవాలి.


అందరి అభిలాష

చివరి నాలుగైదేళ్లలో ఫీల్డింగ్‌లో అత్యంత మెరుగయ్యాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్‌ బృందంగా తయారవ్వడమే లక్ష్యం. జట్టులో ఉండాలనుకొనే వారికి ఇదే కఠిన ఆదేశం. తెలుపు బంతి క్రికెట్‌లో అత్యున్నత ఫీల్డింగ్‌ ప్రమాణాలతో ఆటగాడు ఉండాలి. ఆటగాళ్లు, కోచ్‌లు, జట్టు యాజమాన్యం అందరి ప్రయత్నం ఇప్పుడున్న నిలకడను మరో స్థాయికి తీసుకెళ్లడమే.


సంతోషంతోనే

రాబోయే రెండేళ్లు జట్టుకు పరివర్తన దశ. టెస్టు, వన్డే, టీ20 జట్లలోకి చాలామంది యువకులు వస్తున్నారు. మరో నలుగురైదుగురు బౌలర్లను గుర్తించాలి. తర్వాత 25-26 నెలల్లో జట్టును అత్యంత సంతోషంగా ఉంచడమే నా లక్ష్యం. అప్పుడే బలమైన వారసత్వాన్ని నెలకొల్పేందుకు సమయం వస్తుంది. ఇది అత్యంత సవాల్‌ లేకుంటే నేనిక్కడ ఉండేవాడినే కాదు. సవాళ్లను నేనిష్టపడతా. వాటి నుంచి పారిపోవద్దని ఈ ఆట నేర్పించింది. ప్రత్యర్థి కళ్లలోకి సూటిగా చూస్తూ మైదానంలో పోటీ పడాలి. ఆడే ప్రతిచోటా అలా ఉండేందుకే ప్రయత్నిస్తాం. పర్యటించే ప్రతి దేశాన్ని స్వదేశంగా భావిస్తాం. అదే అంకితభావం, అదే అభిరుచి, అదే కసితో ఆడతాం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.