Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143923
            [news_title_telugu_html] => 

పుజారా శతకం, రోహిత్‌ అర్ధశతకం

[news_title_telugu] => పుజారా శతకం, రోహిత్‌ అర్ధశతకం [news_title_english] => Cheteshwar Purjara smashed century against West Indies A in a practice match [news_short_description] => వెస్టిండీస్‌ ఎ జట్టుతో శనివారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా తొలి రోజు ఆకట్టుకుంది. ఆట పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి... [news_tags_keywords] => Test Cricket ,INDvsWI ,Team India ,Pujara ,Rohit Sharma [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 09:07:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పుజారా శతకం, రోహిత్‌ అర్ధశతకం - Cheteshwar Purjara smashed century against West Indies A in a practice match - EENADU
close

తాజా వార్తలు

పుజారా శతకం, రోహిత్‌ అర్ధశతకం

కూలిడ్జ్‌: వెస్టిండీస్‌ ఎ జట్టుతో శనివారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా తొలి రోజు ఆకట్టుకుంది. ఆట పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 297 పరుగులు  చేసింది. చెతేశ్వర్‌ పుజారా(100; 187 బంతుల్లో 8x4, 1X6) శతకం పూర్తి చేసిన తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ (68; 115 బంతుల్లో  8X1, 1X6) అర్ధశతకంతో రాణించాడు. హనుమవిహారీ (37; 101 బంతుల్లో 2X4), రవీంద్ర జడేజా(1) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్న నేపథ్యంలో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా అడుగులు వేస్తోంది. 

అంతకుముందు జట్టు స్కోర్‌ 36 పరుగుల వద్ద మయాంక్‌ అగర్వాల్‌ (12) తొలి వికెట్‌ రూపంలో కార్టర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కేఎల్‌ రాహుల్‌(36), అజింక్యా రహానే(1) ఒక్క పరుగు వ్యవధిలో ఔటవ్వగా ఆ తర్వాత పుజారా, రోహిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్‌ ఔటయ్యాక విహారీతో జతకట్టిన పుజారా శతకం తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరిగాడు. దీంతో తొలి రోజు పూర్తయ్యేసరికి టీమిండియా 300 పరుగులకు చేరువైంది. విండీస్‌ బౌలర్లలో కార్టర్‌ మూడు వికెట్లతో ఆకట్టుకోగా హార్డింగ్‌, అకిం ఫ్రాజర్‌ తలో వికెట్‌ తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.