Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143924
            [news_title_telugu_html] => 

కొత్త జెర్సీల్లో టీమిండియా ఆటగాళ్లు

[news_title_telugu] => కొత్త జెర్సీల్లో టీమిండియా ఆటగాళ్లు [news_title_english] => Team India in new jerseys for Test Cricket against West Indies practice match [news_short_description] => విండీస్‌ ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శనివారం కొత్త జెర్సీలతో దర్శనమిచ్చారు. టెస్టు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లను గుర్తించేందుకు... [news_tags_keywords] => Test Cricket ,Team India ,INDvsWI ,BCCI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1162719855537283072 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 09:50:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కొత్త జెర్సీల్లో టీమిండియా ఆటగాళ్లు - Team India in new jerseys for Test Cricket against West Indies practice match - EENADU
close

తాజా వార్తలు

కొత్త జెర్సీల్లో టీమిండియా ఆటగాళ్లు

వీడియో విడుదల చేసిన బీసీసీఐ

కూలిడ్జ్‌: విండీస్‌ ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శనివారం కొత్త జెర్సీలతో దర్శనమిచ్చారు. టెస్టు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లను గుర్తించేందుకు ఐసీసీ ఇటీవల కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 142 ఏళ్ల టెస్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు, నంబర్లకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన యాషెస్‌ తొలి టెస్టు నుంచే ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. 

మరోవైపు శ్రీలంక X న్యూజిలాండ్‌ జట్లు సైతం కొత్త జెర్సీలతో టెస్టు క్రికెట్‌ను ప్రారంభించడం విశేషం. ఈ నాలుగు జట్ల తర్వాత ఇప్పుడు భారత ఆటగాళ్లు తమ కొత్త జెర్సీలను ధరించారు. శనివారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ తమ కొత్త జెర్సీలతో మైదానంలోకి అడుగుపెడుతున్న వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. అందులో ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు కనిపించాయి.

కాగా తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. చెతేశ్వర్‌ పుజారా(100) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగ్గా రోహిత్‌శర్మ(68) అర్ధశతకంతో రాణించాడు. హనుమ విహారీ(37), జడేజా(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో కార్టర్‌ మూడు వికెట్లు తీయగా హార్డింగ్‌, ఫ్రాజర్‌ తలో వికెట్‌ తీశారు.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.