Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143945
            [news_title_telugu_html] => 

కోచ్‌ ఎంపికలో కమిటీకి చిత్తశుద్ధి ఉందా?

[news_title_telugu] => కోచ్‌ ఎంపికలో కమిటీకి చిత్తశుద్ధి ఉందా? [news_title_english] => BCCI letter getting trolled on twitter by cricket fans [news_short_description] => టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న తరుణంలో క్రికెట్‌ సలహా కమిటీ చిత్తశుద్ధిపై మరో వివాదం వెలుగులోకి వచ్చింది... [news_tags_keywords] => Cricket ,BCCI,Team India Coach ,Ravi Shastri [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 13:04:50 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోచ్‌ ఎంపికలో కమిటీకి చిత్తశుద్ధి ఉందా? - BCCI letter getting trolled on twitter by cricket fans - EENADU
close

తాజా వార్తలు

కోచ్‌ ఎంపికలో కమిటీకి చిత్తశుద్ధి ఉందా?

సీఏసీ పొరపాటుపై.. అభిమానుల ఆగ్రహం

ముంబయి: టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న తరుణంలో క్రికెట్‌ సలహా కమిటీ చిత్తశుద్ధిపై మరో వివాదం వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ బహిర్గతం చేసిన అధికారిక ప్రకటనలో కమిటీ చేసిన పొరపాటుపై నెటిజన్లు మండిపడుతున్నారు. న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ పేరును తప్పుగా పేర్కొనడంతో ఇంటర్వ్యూల ప్రక్రియపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ ప్రకటన పత్రాన్ని ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ప్రజలను మోసం చేయడానికే ఇంటర్వ్యూలు చేశారని, అందులో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మైక్‌హెసన్‌, టామ్‌ మూడీ పేర్లను ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే విధంగా సాగిన ఇంటర్వ్యూ ప్రక్రియ సరిపోదన్నట్టు.. ఇలా తప్పులు రాస్తారా? అని నిలదీశారు. ఇదంతా కాకుండా ముందే నిర్ణయించిన రవిశాస్త్రి పేరొక్కటే ప్రకటించి ఉంటే సరిపోయేదని విమర్శిస్తున్నారు. 

క్రికెట్‌ సలహా కమిటీకి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదన్నట్లు తెలుస్తోందని, అభ్యర్థుల పేరు తెలవకపోతే కనీసం గూగుల్‌లో అయినా చూడాల్సిందని ఎద్దేవాచేస్తున్నారు. శాస్త్రి కాకుండా ఇతరులను ఇంటర్వ్యూలకు పిలవడంలో నిజాయతీ ఉందా లేక అందరినీ మోసం చేస్తున్నారా అని ఘాటుగా పోస్టులు చేస్తున్నారు. కపిల్‌దేవ్‌ కమిటీ చెత్త నిర్ణయం తీసుకుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.