Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144076
            [news_title_telugu_html] => 

నాలుగులో శ్రేయస్‌ సరైనోడు: రవిశాస్త్రి

[news_title_telugu] => నాలుగులో శ్రేయస్‌ సరైనోడు: రవిశాస్త్రి [news_title_english] => Head coach Ravi Shastri names India’s No. 4 future batsman [news_short_description] => గత రెండేళ్ల నుంచి టీమిండియాకు బ్యాటింగ్‌లో నాలుగో స్థానం సమస్య వెంటాడుతూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థానానికి [news_tags_keywords] => Ravi Shastri,Shreyas Iyer,Virat Kohli, No. 4 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:27:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నాలుగులో శ్రేయస్‌ సరైనోడు: రవిశాస్త్రి - Head coach Ravi Shastri names India’s No. 4 future batsman - EENADU
close

తాజా వార్తలు

నాలుగులో శ్రేయస్‌ సరైనోడు: రవిశాస్త్రి

దిల్లీ: గత రెండేళ్ల నుంచి టీమిండియాకు బ్యాటింగ్‌లో నాలుగో స్థానం సమస్య వెంటాడుతూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థానానికి సరైన బ్యాట్స్‌మన్‌ మాత్రం దొరకట్లేదు. మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో భారత్ ప్రపంచకప్‌ను కూడా చేజార్చుకుంది. ప్రస్తుతం నాలుగో స్థానంలో భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను పరీక్షిస్తున్నారు. కానీ పంత్‌ ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. చెత్త షాట్లతో పెవిలియన్‌కు చేరుతున్నాడు. దీంతో ఐదో స్థానంలో నిలకడగా ఆడుతున్న శ్రేయస్‌కు నాలుగులో అవకాశం ఇవ్వాలని మాజీలు అంటున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి కూడా శ్రేయస్‌కు మద్దతివ్వడంతో అతడి స్థానం దాదాపు ఖరారైపోయినట్లుగా క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే వన్డేల్లో యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్‌కు నాలుగో స్థానంలో అవకాశం ఇవ్వనున్నామని రవిశాస్త్రి ఓ ఆంగ్ల పత్రికతో పేర్కొన్నాడు. ‘గత రెండేళ్లలో ఎంతో మంది యువకులకు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు అవకాశాలిచ్చాం. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయారు. నిలకడగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌కు నాలుగులో అవకాశం ఇవ్వనున్నాం.’ అని తెలిపాడు.

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్‌ వరుసగా 71, 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కోహ్లీతో కలిసి ఆదుకున్నాడు. సారథితో కలిసి రెండు సార్లు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లీ సైతం శ్రేయస్‌ బ్యాటింగ్‌ను కొనియాడాడు. అతడు నాపై ఒత్తిడిని పూర్తిగా తొలగించాడని, ఇలాగే బాధ్యతాయుతంగా ఆడితే భారత మిడిల్‌ ఆర్డర్‌లో సుస్థిర స్థానం దక్కించుకుంటాడని చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఆగస్టు 22న ఆంటిగ్వాలో తొలి టెస్టును ఆడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.