Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144429
            [news_title_telugu_html] => 

పట్టుబిగించిన భారత జట్టు

[news_title_telugu] => పట్టుబిగించిన భారత జట్టు [news_title_english] => Team India in a good stage by the end of second day against West Indies A [news_short_description] => వెస్టిండీస్‌ ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న అజింక్యా... [news_tags_keywords] => Cricket ,INDvsWI ,Pujara,Rohit Sharma ,Team India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 07:50:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పట్టుబిగించిన భారత జట్టు - Team India in a good stage by the end of second day against West Indies A - EENADU
close

తాజా వార్తలు

పట్టుబిగించిన భారత జట్టు

కూలిడ్జ్‌: వెస్టిండీస్‌ ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న అజింక్యా రహానే నేతృత్వంలోని టీమిండియా 200 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 181 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో 116 పరుగుల ఆధిక్యం లభించింది. కావెం హాడ్జ్‌(51; 100 బంతుల్లో 8x4) అర్ధశతకం సాధించగా జొనాథన్‌ కార్టర్‌ (26; 35 బంతుల్లో 2X4, 1X6), హామిల్టన్‌(33; 72 బంతుల్లో 4X4) ఫర్వాలేదనిపించారు. ఇషాంత్‌శర్మ(21/3), ఉమేశ్‌యాదవ్‌(19/3), కుల్‌దీప్‌ యాదవ్‌(35/3) కట్టుదిట్టంగా బంతులేయడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ తక్కువ పరుగులకే వెనుతిరిగారు.

మరోవైపు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 297 పరుగుల వద్ద రెండో రోజు ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. పుజారా (100;  187 బంతుల్లో 8X4, 1X6) రిటైర్డ్‌ హర్ట్‌ కాగా రోహిత్‌శర్మ (68; 115 బంతుల్లో 8X4, 1X6) అర్ధశతకం సాధించాడు. రిషభ్‌పంత్ (33) పరుగులు చేయగా హనుమ విహారి(37 నాటౌట్‌)గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 84 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(13) మరోసారి విఫలమయ్యాడు. ప్రస్తుతం రహానే(20), విహారి(48) క్రీజులో ఉన్నారు. రెండో రోజులాగే సోమవారం (ఆఖరి రోజు) మంచి ప్రదర్శన చేస్తే టీమిండియా గెలుపు ఖాయమయ్యే అవకాశం ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.