Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144438
            [news_title_telugu_html] => 

కోచ్‌ ఎంపికపై ఆటగాళ్లు ఏమన్నారంటే?

[news_title_telugu] => కోచ్‌ ఎంపికపై ఆటగాళ్లు ఏమన్నారంటే? [news_title_english] => Ravi Shastri says Team India boys are happy on reappointment as head coach [news_short_description] => టీమిండియా కోచ్‌గా తాను తిరిగి ఎంపికవ్వడం పట్ల టీమిండియా ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారని రవిశాస్త్రి చెప్పాడు. ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో... [news_tags_keywords] => Ravi Shastri ,Team India ,Team India Coach ,INDvsWI ,BCCI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 11:02:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోచ్‌ ఎంపికపై ఆటగాళ్లు ఏమన్నారంటే? - Ravi Shastri says Team India boys are happy on reappointment as head coach - EENADU
close

తాజా వార్తలు

కోచ్‌ ఎంపికపై ఆటగాళ్లు ఏమన్నారంటే?

ఆంటిగ్వా: టీమిండియా కోచ్‌గా తాను తిరిగి ఎంపికవ్వడం పట్ల టీమిండియా ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారని రవిశాస్త్రి చెప్పాడు. ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘నన్ను తిరిగి కోచ్‌గా ఎంపిక చేయడం పట్ల కుర్రాళ్లు ఏమనుకున్నారో నా దగ్గరికి వచ్చి చెప్పారు. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ అంతా కలిసి జట్టుని విజయ పథంలో నడిపించాలని నిర్ణయించుకున్నాం. అలాగే మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వారికి అవగాహన ఉంది. వాటిని ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నాడు. 

కపిల్‌దేవ్‌, అన్షుమాన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామిల ఆధ్వర్యంలోని క్రికెట్‌ సలహా కమిటీ మూడు రోజుల క్రితం కోచ్‌ పదివికి ఇంటర్వ్యూలు చేసి రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేశారు. అతడికి మైక్‌ హెసన్‌, టామ్‌మూడీ గట్టి పోటీ ఇచ్చారని కోచ్‌ని ప్రకటించే సమయంలో కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు. కోచ్‌ పదవికి భారత్‌ తరఫున మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌, టీమిండియా మాజీ మేనేజర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్ సైతం పోటీపడ్డారు. వీరందరి కన్నా రవిశాస్త్రి ప్రజెంటేషన్‌ బాగుందని, అందుకే అతడిని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని మాజీ కెప్టెన్‌ పేర్కొన్నాడు. మరోవైపు రవిశాస్త్రి ఎంపిక పట్ల భారత క్రీడాభిమానులు ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.