Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144507
            [news_title_telugu_html] => 

వన్డేలు ముగిసినా.. ఇంకా విండీస్‌లోనే సైని

[news_title_telugu] => వన్డేలు ముగిసినా.. ఇంకా విండీస్‌లోనే సైని [news_title_english] => To groom him for Tests Indian team keeps Saini as cover for series against WI [news_short_description] => పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులు ముగిసినప్పటికీ యువపేసర్‌ నవదీప్‌ సైని వెస్టిండీస్‌లోనే ఉండిపోనున్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా నెట్‌ బౌలర్‌గా అతడి సేవలు వినియోగించుకోవాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది.... [news_tags_keywords] => Navdeep Saini, BCCI,Team India,jasprith bumrah,INDvsWI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 17:46:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వన్డేలు ముగిసినా.. ఇంకా విండీస్‌లోనే సైని - To groom him for Tests Indian team keeps Saini as cover for series against WI - EENADU
close

తాజా వార్తలు

వన్డేలు ముగిసినా.. ఇంకా విండీస్‌లోనే సైని

దిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులు ముగిసినప్పటికీ యువపేసర్‌ నవదీప్‌ సైని వెస్టిండీస్‌లోనే ఉండిపోనున్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా నెట్‌ బౌలర్‌గా అతడి సేవలు వినియోగించుకోవాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. టీమిండియా భవిష్యత్తు అవసరాల కోసం అతడిని తీర్చిదిద్దేందుకు ఇదొక మంచి అవకాశంగా భావిస్తోంది. అరంగేట్రం టీ20 పోరులోనే మూడు వికెట్లు తీసిన సైని మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రంజీల్లో దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడికి ఎరుపు బంతిపై బాగా పట్టుంది. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలడు. బంతిని బలంగా నేలకు విసిరిగొట్టగలడు. ప్రపంచకప్‌ సందర్భంగానూ అతడిని టీమిండియా బ్యాకప్‌, నెట్‌ బౌలర్‌గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే.

‘అవును, టెస్టు సిరీస్‌ కోసం సైనిని అక్కడే ఉండాలని జట్టు యాజమాన్యం కోరింది. ప్రాథమికంగా ఒక నెట్‌ బౌలర్‌గా అక్కడ ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన టెస్టు బౌలర్‌గా అతడిని తీర్చిదిద్దాలని టీమిండియా భావిస్తోంది. కొన్నేళ్లుగా అతడు ఎరుపు బంతితో రాణిస్తున్నాడు. అందుకే జట్టు యాజమాన్యం అతడిపై దృష్టి సారించింది. సైని మెరుగైతే ఫాస్ట్‌ బౌలర్ల బృందం మరింత పెరుగుతుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

సైని విండీస్‌లోనే ఉంటే బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అతడిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 43 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో ఇప్పటికే సైని 120 వికెట్లు తీశాడు. ‘దేశంలోని ఫాస్ట్‌బౌలర్లను అత్యుత్తమంగా తయారుచేసిన భరత్‌ అరుణ్‌ సేవలను విస్మరించలేం. సైని దేశవాళీ క్రికెట్‌ ఆడటం కన్నా అతడు అంతర్జాతీయ యవనికపై ఉండటం మంచిది. తర్వాతి స్థాయిలోని పోటీ, మెలకువలు తెలుసుకోగలుగుతాడు’ అని ఆ అధికారి వెల్లడించారు. మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా పనిభారం దృష్టిలో పెట్టుకొని సైనిని బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేయించినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న విండీస్‌ బోర్డు XI మూడు రోజుల మ్యాచ్‌లోనూ అతడు ఆరు ఓవర్లు వేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.