Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144522
            [news_title_telugu_html] => 

కేఎల్‌ రాహుల్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడా?

[news_title_telugu] => కేఎల్‌ రాహుల్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడా? [news_title_english] => KL Rahul breaks silence on his alleged relationship with Akansha Ranjan Kapoor [news_short_description] => క్రికెటర్లతో సినిమా తారల అనుబంధం ఎప్పట్నుంచో చూస్తున్నదే! టైగర్‌ పటౌడీతో మొదలు పెడితే విరాట్‌ కోహ్లీ వరకు బాలీవుడ్‌ కథానాయికలనే పెళ్లాడారు. తాజాగా మరో యువ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పంజాబీ మోడల్‌, నటి ఆకాంక్ష రంజన్‌... [news_tags_keywords] => KL Rahul ,kansha Ranjan Kapoor,INDvsWI,love [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 16:13:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కేఎల్‌ రాహుల్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడా? - KL Rahul breaks silence on his alleged relationship with Akansha Ranjan Kapoor - EENADU
close

తాజా వార్తలు

కేఎల్‌ రాహుల్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడా?

ముంబయి: క్రికెటర్లతో సినిమా తారల అనుబంధం ఎప్పట్నుంచో చూస్తున్నదే! టైగర్‌ పటౌడీతో మొదలు పెడితే విరాట్‌ కోహ్లీ వరకు బాలీవుడ్‌ కథానాయికలనే పెళ్లాడారు. తాజాగా మరో యువ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పంజాబీ మోడల్‌, నటి ఆకాంక్ష రంజన్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారిద్దరూ చనువుగా ఉన్న చిత్రాలూ ఇంటర్నెట్లో వైరల్‌ అవుతున్నాయి. ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌కు రాహుల్‌ను ఆకాంక్ష స్వయంగా పరిచయం చేయడంతో ఈ వార్తలకు రెక్కొలొచ్చాయి. ఎట్టకేలకు ఆమెతో అనుబంధంపై ఈ కర్ణాటక క్రికెటర్‌ స్పందించాడు.

‘ఓహ్‌, ఇవన్నీ దేని గురించి రాసినట్టు? నేను నిజంగా పేపర్లు చదవను. అందుకే నా గురించి ఏం రాశారో తెలియదు. నా వ్యక్తిగత విషయాలను నాతోనే ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తాను. వాటి గురించి ఇతరులతో చర్చించను. ప్రస్తుతానికి నేను  క్రికెట్‌కే అంకితమయ్యాను’ అని రాహుల్‌ ఓ మీడియా సంస్థకు వెల్లడించాడట. ఇంతకూ మీరు ఒంటరా? కాదా?అన్న ప్రశ్నకు మాత్రం సందేహాస్పద జవాబు ఇచ్చాడు. ‘నిజంగా నాకైతే తెలియదు. ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చినప్పుడు నేనే మీకు తెలియజేస్తాను’ అని రాహుల్‌ అన్నాడు.

ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ కరీబియన్‌ దీవుల్లో పర్యటిస్తున్నాడు. మూడు ఫార్మాట్లకు ఎంపికైన అతడికి కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చారు. వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టులో తుది జట్టులో స్థానం దక్కుతుందో లేదో ఇంకా తెలియదు. మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారితో అతడికి పోటీ ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.