Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144593
            [news_title_telugu_html] => 

విరుద్ధ ప్రయోజనాలపై ‘శ్వేతపత్రం’

[news_title_telugu] => విరుద్ధ ప్రయోజనాలపై ‘శ్వేతపత్రం’ [news_title_english] => CoA facing issues implementing Conflict clause preparing White Paper Edulji [news_short_description] => పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై ‘శ్వేత పత్రం’ రూపొందిస్తున్నామని బీసీసీఐ క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ తెలిపారు. మరో సభ్యుడు లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ రవి తొగ్డెతో కలిసి మాజీ క్రికెటర్లు పడుతున్న...... [news_tags_keywords] => Diana Edulji ,Ravi Thodge,Dilip Vengsarkar,Sourav Ganguly ,Sachin Tendulkar,Rahul Dravid [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 22:35:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విరుద్ధ ప్రయోజనాలపై ‘శ్వేతపత్రం’ - CoA facing issues implementing Conflict clause preparing White Paper Edulji - EENADU
close

తాజా వార్తలు

విరుద్ధ ప్రయోజనాలపై ‘శ్వేతపత్రం’

ముంబయి: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై ‘శ్వేత పత్రం’ రూపొందిస్తున్నామని బీసీసీఐ క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ తెలిపారు. మరో సభ్యుడు లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ రవి తొగ్డెతో కలిసి మాజీ క్రికెటర్లు పడుతున్న ఇబ్బందులపై ఆమె సమావేశం నిర్వహించారు. దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, సౌరవ్‌ గంగూలీ (స్కైప్‌ ద్వారా), ఇర్ఫాన్‌ పఠాన్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, రోహన్‌ గవాస్కర్‌, పార్థివ్‌ పటేల్‌, అజిత్‌ అగార్కర్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ‘ఒకరికే ఒక పదవి’ నిబంధన అమల్లో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.

‘విరుద్ధ ప్రయోజనాల అంశంపై చర్చించాం. క్రికెటర్లు పడుతున్న ఇబ్బందులేంటి? నిబంధనల అమల్లో పాలకులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో మాట్లాడాం. గంగూలీ స్కైప్‌ ద్వారా తన అభిప్రాయం వెల్లడించారు. మంచి సూచనలు వచ్చాయి. వీటి ఆధారంగా ఒక శ్వేతపత్రం రూపొందించి అమికస్‌ క్యూరీకి సమర్పిస్తాం. ఇప్పటికైతే నిబంధనలు యథాతథంగా వర్తిస్తాయి. నిబంధన రద్దు చేయాలా? సవరించాలా? అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాతి సమావేశంలో మరిన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తాం. క్రికెట్‌కు ఏది మంచిదో అదే చేస్తాం. ఇది సుదీర్ఘ ప్రక్రియ కావడంతో శ్వేతపత్రంలో ఏయే అంశాలు చేరుస్తామో ఇప్పుడే చెప్పలేం’ అని ఎడుల్జీ వెల్లడించారు.

‘క్రికెటర్ల ఇబ్బందుల్లో వాస్తవం ఉంది. కొన్నింటిని అంగీకరించాల్సిందే. కొన్నింటిని ఒప్పుకోలేం. క్రికెటర్ల నుంచి సలహాలు ఆహ్వానించి పరిష్కారానికి కృషి చేస్తాం’ అని సీఓఏ మరో సభ్యుడు రవి తొగ్డె అన్నారు. సమావేశం చక్కగా సాగిందని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నారు. ఆటగాడు-వ్యాఖ్యాత, వ్యాఖ్యాత-ఐపీఎల్‌-ఫ్రాంచైజీ సిబ్బంది, వ్యాఖ్యాత-పాలకుడు-ఫ్రాంచైజీ మార్గనిర్దేశకుడు, బీసీసీఐ పదవి-ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఉద్యోగి వంటి అంశాల్లో ప్రస్తుతం ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవిడ్‌, లక్ష్మణ్, సచిన్‌, గంగూలీ సహా మరెంతో మంది పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.