Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144616
            [news_title_telugu_html] => 

370 రద్దు: షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

[news_title_telugu] => 370 రద్దు: షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు [news_title_english] => Shoaib Akhtar pleads to not spread ‘hatred’ amidst Kashmir tensions [news_short_description] => కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణం రద్దు చేసిన తర్వాత పాకిస్థానీ రాజకీయ నాయకులు, క్రీడాకారులు అవాకులు చవాకులు పేలారు. మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అయితే ‘యుద్ధం’ వంటి...... [news_tags_keywords] => Shoaib Akhtar,Imran Khan,Article 370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:37:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
370 రద్దు: షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు - Shoaib Akhtar pleads to not spread ‘hatred’ amidst Kashmir tensions - EENADU
close

తాజా వార్తలు

370 రద్దు: షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబయి: కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణం రద్దు చేసిన తర్వాత పాకిస్థానీ రాజకీయ నాయకులు, క్రీడాకారులు అవాకులు చవాకులు పేలారు. మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అయితే ‘యుద్ధం’ వంటి పదాల్ని తన ప్రసంగాల్లో వాడుతున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. షాహిద్‌ అఫ్రిది సైతం తన అక్కసును వెళ్లగక్కాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం కాస్త పరిణతి చూపించాడు. కశ్మీర్లో ఉద్రిక్తత నెలకొలాన్న నేపథ్యంలో ఎవరూ ‘విద్వేషం’ వ్యాప్తి చేయొద్దని కోరాడు. తన యూట్యూబ్‌ ఛానల్లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

‘మన పరిస్థితి బాగాలేదని నేను అంగీకరిస్తాను. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తారు. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం. ఈ రెండూ నేను ఒప్పుకుంటాను. కానీ మరింత విద్వేషం వ్యాప్తి చెందేందుకు మాత్రం మనం కారణం కావొద్దు. ఉద్రికత్త, ఆందోళనను మరింత పెంచే వ్యాఖ్యలు, చర్యల జోలికి పోవొద్దు. మీరు మీ వైఖరి, విశ్వాసాలకే కట్టుబడండి. కానీ పరిస్థితిని మరింత దిగజారకుండా చూడండి’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.