Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144990
            [news_title_telugu_html] => 

నన్ను క్షమించండి: స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌

[news_title_telugu] => నన్ను క్షమించండి: స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌ [news_title_english] => Baneed cricketer Apologies to Pakistan Cricket Board [news_short_description] => పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్‌ షార్జీల్‌ఖాన్‌ తిరిగి తన కెరీర్‌ను కొనసాగించేందుకు... [news_tags_keywords] => Cricket ,PCB ,Pakistan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 09:50:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నన్ను క్షమించండి: స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌ - Baneed cricketer Apologies to Pakistan Cricket Board - EENADU
close

తాజా వార్తలు

నన్ను క్షమించండి: స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌

లాహోర్‌: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్‌ షార్జీల్‌ఖాన్‌ తిరిగి తన కెరీర్‌ను కొనసాగించేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. సోమవారం పాక్‌ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులను షార్జీల్‌ కలిసి విజ్ఞప్తి చేశాడు. బోర్డు విధించిన నిషేధం గడువు ముగియడంతో తిరిగి కెరీర్‌ను కొనసాగించేందుకు అతడికి అనుమతి లభించింది. ‘నా వల్ల ఇబ్బంది పడ్డ పీసీబీకి, సహచరులకు, అభిమానులకు, కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. ఇప్పటి నుంచి బాధ్యతాయుతంగా ఉండి భవిష్యత్‌లో మంచి ప్రదర్శన చేస్తానని హమీ ఇస్తున్నా’ అంటూ పీసీబీ విడుదల చేసిన లేఖలో షార్జీల్‌ పేర్కొన్నాడు. 

అతడికి విధించిన నిషేధం రెండున్నరేళ్ల గడువు ముగిసినందున తిరిగి రిహాబిలిటేషన్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడని, ఈ ఏడాది పూర్తయ్యేలోపు షార్జీల్‌ తన శిక్షణను పూర్తి చేసుకుంటాడని పాక్‌ బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత జాతీయ జట్టులో చేరతాడని చెప్పింది. 2017లో దుబాయ్‌లో నిర్వహించిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో షార్జీల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన పాక్‌ బోర్డు. తర్వాత దాన్ని రెండున్నరేళ్లకు కుదించింది. ఇటీవల ఆ గడువు పూర్తవడంతో తిరిగి తన కెరీర్‌ కొనసాగించేందుకు అవకాశమిచ్చింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ పాక్‌ క్రికెటర్‌ ఒక టెస్టు, 25 వన్డేలతో పాటు 15 టీ20లు ఆడాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.