Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145000
            [news_title_telugu_html] => 

ఆర్చర్‌ బౌలింగ్‌: ఆడే కన్నా చూడటమే భయం

[news_title_telugu] => ఆర్చర్‌ బౌలింగ్‌: ఆడే కన్నా చూడటమే భయం [news_title_english] => playing Jofra Archer bowling is better than watching says Marnus Labuschagne [news_short_description] => ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రాఆర్చర్‌ తన అరంగేట్రం టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెట్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను... [news_tags_keywords] => Ashes Series ,ENGvsAUS ,Steve Smith ,Jofra Archer ,Marnus Labuschagne [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 12:32:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆర్చర్‌ బౌలింగ్‌: ఆడే కన్నా చూడటమే భయం - playing Jofra Archer bowling is better than watching says Marnus Labuschagne - EENADU
close

తాజా వార్తలు

ఆర్చర్‌ బౌలింగ్‌: ఆడే కన్నా చూడటమే భయం

ఇంగ్లాండ్‌ పేసర్‌పై మార్నస్‌ లబుషేన్‌

లండన్‌: ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన అరంగేట్ర టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెట్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అతడి బౌలింగ్‌లో స్టీవ్‌స్మిత్‌ మెడకు శనివారం తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. కాగా ఆదివారం సైతం పలువురు ఆటగాళ్లు అతడి బౌలింగ్‌లో గాయపడ్డారు. అందులో ఒకరు స్మిత్‌కు.. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్నస్‌ లబుషేన్‌. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని లబుషేన్‌(59) ఆదుకున్నాడు. క్రీజులోకి వచ్చి ఆర్చర్‌ బౌలింగ్‌లో అతను ఎదుర్కొన్న రెండో బంతికే గాయపడ్డాడు. హెల్మెట్‌కు బంతి బలంగా తాకినా పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి అర్ధశతకంతో లబుషేన్‌ రాణించాడు. 

ఆసీస్‌ను ఓటమి నుంచి తప్పించిన లబుషేన్‌ మాట్లాడుతూ.. మైదానంలో ఆర్చర్‌ బౌలింగ్‌ని ఎదుర్కోవడమే కాస్త నయమని, డ్రెస్సింగ్‌లో రూమ్‌లో కూర్చొని అతడి బౌలింగ్‌ చూడటం చాలా భయంగా ఉంటుందని అన్నాడు. ‘ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌కి దెబ్బ తగిలినప్పుడు కాస్త కంగారు పడ్డా. అలాంటి సమయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆటలో భాగమై మైదానంలో అడుగుపెట్టాక శరీరంలో ఒకరకమైన ఆందోళన మొదలైనప్పుడు ఆ బంతిని చూడటమే తప్ప చేసేదేమీ ఉండదు. ఆర్చర్‌ వేసిన రెండో బంతి నా హెల్మెట్‌కు బలంగా తాకింది. అయినా కుదురుకొని ఏమీ కానట్టు ఆటను కొనసాగించాలి. అలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేందుకు మేమంతా ముందే సిద్ధపడ్డాం. అయితే ఆర్చర్‌ కొన్నిసార్లు చాలా మంచి బౌలింగ్‌ చేశాడు. తన పదునైన బౌలింగ్‌తో మా బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు’ అని లబుషేన్‌ వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.