Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145052
            [news_title_telugu_html] => ఖాళీ సమయంలో ఉమేశ్‌ యాదవ్‌ ఏం చేశాడంటే?
            [news_title_telugu] => ఖాళీ సమయంలో ఉమేశ్‌ యాదవ్‌ ఏం చేశాడంటే?
            [news_title_english] => Umesh says time away from team gave him chance to work on bowling issues
            [news_short_description] => టీమిండియాకు దూరంగా ఉన్నన్నాళ్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై కఠోరంగా శ్రమించానని పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అన్నాడు. తానిప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని వెల్లడించాడు. 2018 డిసెంబర్‌లో ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ గెలిచిన తర్వాత...

            [news_tags_keywords] => Umesh Yadav ,Vidarbha Cricket Academy,Subroto Banerjee 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 14:32:37
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఖాళీ సమయంలో ఉమేశ్‌ యాదవ్‌ ఏం చేశాడంటే? - Umesh says time away from team gave him chance to work on bowling issues - EENADU
close

తాజా వార్తలు

ఖాళీ సమయంలో ఉమేశ్‌ యాదవ్‌ ఏం చేశాడంటే?

కూలిడ్జ్‌ (ఆంటిగ్వా): టీమిండియాకు దూరంగా ఉన్నన్నాళ్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై కఠోరంగా శ్రమించానని పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అన్నాడు. తానిప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని వెల్లడించాడు. 2018 డిసెంబర్‌లో ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ గెలిచిన తర్వాత అతడు జట్టుకు దూరమయ్యాడు. రంజీ విజేత విదర్భ తరఫున అదరగొట్టాడు. వెంటనే ఐపీఎల్‌ ఆడాడు. ఈ మధ్యే విండీస్‌-ఏ తో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జోరు కనబరిచాడు. ఖాళీ సమయంలో విదర్భ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌ సుబ్రతో బెనర్జీ వద్ద శిక్షణ తీసుకున్నాడు.

‘ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా నిరంతరం సాధన చేయాలి. ఏయే ప్రాంతాల్లో బంతులేయాలో తెలుసుకొనేందుకు మంచి లయలో ఉండాలి. ఇన్నాళ్లూ నేనదే చేశాను. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్టు  సన్నద్ధమయ్యాను. టీమిండియాకు ఆడని సమయంలో విదర్భ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌ సుబ్రతో రాయ్‌తో కలిసి పనిచేశాను. వరుసగా ఎక్కువ క్రికెట్‌ ఆడితే లైన్‌ అండ్‌ లెంగ్త్‌ సరిచేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యల్ని  ఆయన వద్ద పరిష్కరించుకున్నాను. చాలా కాలం తర్వాత సన్నాహక మ్యాచ్‌ ఆడినందుకు సంతోషంగా ఉంది. పిచ్‌ భిన్నంగా లేదు. బంతి స్వింగైంది. ఏయే ప్రాంతాల్లో బంతులు విసరాలో మానసికంగా సిద్ధమయ్యాను’ అని ఉమేశ్‌ తెలిపాడు.

‘ఆసీస్‌ పర్యటన తర్వాత రంజీ ట్రోఫీ ఆడాను. వెంటనే ఐపీఎల్‌ వచ్చింది. ఆ తర్వాత దొరికిన ఖాళీ సమయంలో నా పొరపాట్లు, లయపై దృష్టి సారించాను. ఆలోచన దృక్పథంపై పనిచేశాను. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. అప్పుడే తప్పుల్ని సరిచేసుకోగలం. సుబ్రతో బెనర్జీ నా బౌలింగ్‌పై సానుకూలత వ్యక్తం చేశారు. మిగతా ఆటగాళ్లు, బ్యాట్స్‌మెన్‌ను అడిగినప్పుడూ అదే చెప్పారు. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. జట్టు నిరంతరం మ్యాచ్‌లు ఆడుతుందంటే రిజర్వు బెంచ్‌ బలం బాగుండాలి. టీమిండియాలో ఫాస్ట్‌ బౌలర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇది జట్టుకు, ఆటగాళ్లకు మంచిదే. మెరుగైన ప్రదర్శన చేసిన వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి’ అని ఉమేశ్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.