close

తాజా వార్తలు

నా వరకైతే పోటీ పెరిగింది: కోహ్లీ

నార్త్‌సౌండ్‌ (ఆంటిగ్వా): ఈ మధ్య కాలంలో టెస్టు క్రికెట్‌లో పోటీ రెండింతలైందని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. రెండేళ్లు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆసీస్‌, బంగ్లా, భారత్‌, కివీస్‌, పాక్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు తలపడుతాయి. 27 సిరీసుల్లో మొత్తం 71 టెస్టులు ఆడతాయి.

‘ఆటలో మరింత పోటీ పెరిగింది. ఇది టెస్టు క్రికెట్‌కు ఓ ఉద్దేశం తీసుకొచ్చింది. ఇది సరైన సమయంలో సరైన చర్య. టెస్టు క్రికెట్‌ అవసాన దశకు చేరుకుంటుందని జనాలు అంటున్నారు. నా వరకైతే రెండేళ్లుగా టెస్టు క్రికెట్‌లో పోటీ రెండింతలైంది. విజయాల కోసం సవాళ్లు ఎదుర్కోవడం ఆటగాళ్లను బట్టి ఉంటుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ పెట్టిందే అందుకు. ఇకపై బోరు కొట్టే డ్రాలు కాకుండా ఉత్కంఠకరమైన డ్రాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడందరికీ అదనపు పాయింట్లు కావాలి కదా’ అని విరాట్‌ అన్నాడు.

వెస్టిండీస్‌ మ్యాచ్‌తో భారత జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభిస్తోంది. ఆంటిగ్వాలో గురువారం తొలి మ్యాచ్‌ మొదలవుతోంది. సొంతమైదానం కావడంతో కరీబియన్‌ బౌలర్లు పుంజుకొనే అవకాశం ఉందని కోహ్లీ అంటున్నాడు. వారి బౌలింగ్‌ స్థాయికి తగినట్టు ఆడాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌కు ఉందని వెల్లడించాడు. ‘మా బ్యాట్స్‌మెన్‌ ఆ స్థాయికి సరిపోతారని అనుకోను. టెస్టు స్థాయిలో బ్యాట్స్‌మన్‌షిప్‌ చాలా కష్టం. ఛాంపియన్‌షిప్‌తో అది మరింత కష్టంగా మారింది. జట్టుగా కష్టపడాలి. ఇకపై తీసుకొనే ప్రతి నిర్ణయం కీలకం అవుతుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.