
తాజా వార్తలు
ఇద్దరిలో ఒక్కరికే అవకాశం!
విరాట్ కోహ్లీ ఆ సాహసం చేస్తాడా? (ఆంటిగ్వా)
భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ ఫార్మాట్లో తలపడి దాదాపు ఏడు నెలలైంది. అలనాటి దిగ్గజ జట్టు వెస్టిండీస్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ను మొదలు పెడుతోంది. ఈ సిరీస్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న నంబర్‌వన్ కోహ్లీ సేనకు ఓ తలనొప్పి మొదలైంది. తొలి పోరులో వన్డే ఉప సారథి రోహిత్ శర్మకు చోటివ్వాలో?లేక టెస్టు వైస్ కెప్టెన్ రహానెను ఆడించాలో? ఐదో బౌలర్‌వైపు మొగ్గుచూపాలో? కోహ్లీ-శాస్త్రి ద్వయానికి అర్థం కావడం లేదు. గురువారం మొదలయ్యే తొలి పోరులో ఇంతకీ ఏం జరగనుందో?
నలుగురు బౌలర్లైతేనే
తొలి టెస్టులో కోహ్లీసేన నలుగురు బౌలర్లతోనే రంగంలోకి దిగితే వన్డే, టెస్టు ఉప సారథులకు జట్టులో చోటు దక్కేందుకు అవకాశాలు ఉంటాయి. అదే తుది జట్టులో చోటు కోసం పోటీ హోరాహోరీగా ఉంటే మాత్రం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న రహానెకు అవకాశం లభించకపోవచ్చని తెలుస్తోంది. ఏడాదికిపైగా అతడు ఆశించిన రీతిలో పరుగులు చేయడం లేదు. కౌంటీ క్రికెట్లోనూ రాణించలేదు. విండీస్ బోర్డు XIతో జరిగిన మూడు రోజుల సన్నాహక పోరులో తొలి ఇన్నింగ్స్‌లో జింక్స్ విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు. హిట్‌మ్యాన్ సైతం ఓ అర్ధశతకం బాదడంతో జట్టు కూర్పుపై సందిగ్ధం ఏర్పడింది.
జడ్డూ సమతూకం
టీమిండియాలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయొచ్చు. రాహుల్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకొంటే హనుమ విహారి ఆ స్థానం భర్తీ చేస్తాడు. ఐతే ఆస్ట్రేలియాలో అతడు కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. మిడిలార్డర్లో కుదురుగా ఆడుతున్నాడు. టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారాకు మూడో స్థానం ఖాయం. నాలుగులో విరాట్ వస్తాడు. రిషభ్ పంత్‌ను ఆరో స్థానంలో పంపించొచ్చు. హార్దిక్ పాండ్య లేకపోవడంతో సమతూకం కోసం రవీంద్ర జడేజాను ఏడులో ఆడిస్తారు. ఇక గందరగోళం నెలకొంది ఐదో స్థానంలో వచ్చే రహానె, రోహిత్‌పైనే.
ఆ సాహసం చేస్తాడా?
ఉప సారథులు ఇద్దరికీ చోటు దక్కాలంటే కోహ్లీసేన నలుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ చోటు దక్కించుకుంటారు. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లో ఎవరో ఒక స్పిన్నర్‌కే అవకాశం ఉంటుంది. అదనపు బ్యాట్స్‌మన్ కావాలంటే సమీకరణం నుంచి జడ్డూను పక్కన పెట్టాల్సి ఉంటుంది. కరీబియన్ దీవుల్లో ఎండ వేడిమి, ఉక్కపోత వాతావరణానికి బౌలర్లు త్వరగా అలిసిపోతారు. ఓవర్‌రేట్ సక్రమంగా ఉండాలంటే మరో బౌలర్ ఉండాల్సిందే. కోహ్లీ ఎప్పుడూ ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగేందుకే ఇష్టపడతాడు. ఎందుకంటే టెస్టుల్లో 20 వికెట్లు తీస్తేనే విజయం సాధ్యం. పిచ్ పచ్చికతో కళకళలాడితే నాలుగో పేసర్‌గా ఉమేశ్ యాదవ్ వస్తాడు. ప్రస్తుతం నలుగురు బౌలర్లతోనే 20 వికెట్లు తీయగల సామర్థ్యం టీమిండియాకు ఉందని భావిస్తున్నారు. ఐతే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఆరంభ పోరులో కోహ్లీ ఆ రిస్క్ తీసుకుంటాడా?
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
ఛాంపియన్
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- కిర్రాక్ కోహ్లి
- తీర్పు చెప్పిన తూటా
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవతార్చన

శ్రీ మహాలక్ష్మికి సువర్ణాలయం
బంగారం... స్తంభాలు బంగారం... వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం విమానం, అర్ధమంటపం శఠగోపం... అన్నీ బంగారంతో చేసినవే. అంటే స్వర్ణదేవాలయం! అమృత్సర్ స్వర్ణదేవాయంలో కూడా మంటపాలూ, గోపురాలూ ఇవన్నీ ఉండవే అనుకుంటున్నారా... మీ సందేహం నిజమే, ఇది అమృత్సర్ గురుద్వారా కాదు,