Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145103
            [news_title_telugu_html] => 

‘డాన్‌’ను వణికించిన భారతీయుడు!

[news_title_telugu] => ‘డాన్‌’ను వణికించిన భారతీయుడు! [news_title_english] => World Badminton Championships HS Prannoy stuns Lin Dan [news_short_description] => భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సంచలనం సృష్టించాడు. ఐదుసార్లు ఛాంపియన్‌, మాజీ నంబర్‌వన్‌ లిన్‌ డాన్‌ (చైనా)ను మట్టికరిపించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో.... [news_tags_keywords] => HS Prannoy,Lin Dan, World Championships [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1163756286594428928 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:16:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘డాన్‌’ను వణికించిన భారతీయుడు! - World Badminton Championships HS Prannoy stuns Lin Dan - EENADU
close

తాజా వార్తలు

‘డాన్‌’ను వణికించిన భారతీయుడు!

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సంచలనం సృష్టించాడు. ఐదుసార్లు ఛాంపియన్‌, మాజీ నంబర్‌వన్‌ లిన్‌ డాన్‌ (చైనా)ను మట్టికరిపించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 21-11, 13-21, 21-7తో విజయ దుందుభి మోగించాడు. మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు. తొలి సీడ్‌ కెంటో మోమోటా (జపాన్‌), ఎన్రిక్‌ పెనల్వెర్‌ మ్యాచ్‌లో గెలిచిన వారితో ప్రణయ్‌ తలపడతాడు. డాన్‌ ప్రస్తుతం 11 సీడ్‌ కాగా ప్రణయ్‌ 30వ ర్యాంకులో ఉన్నాడు.

తొలిగేమ్‌లో ప్రణయ్‌ ఎక్కువ శ్రమించలేదు. సునాయసంగా గెలిచేశాడు. ఐతే రెండో గేమ్‌లో డాన్‌ విజృంభించాడు. తన మునుపటి ఆటతో బెంబేలెత్తించాడు. 21-13 తేడాతో గేమ్‌ను గెలిచి ప్రణయ్‌పై ఒత్తిడి పెంచాడు. అనూహ్యంగా నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత ఆటగాడు దుమ్మురేపాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పాయింట్లు రాబట్టాడు. గేమ్‌లో విరామ సమయానికి 6 పాయింట్ల ఆధిక్యంలో నుంచి 21-7తో మ్యాచ్‌ గెలిచాడు. ఇండోనేషియా ఓపెన్‌- 2018, ఫ్రెంచ్‌ ఓపెన్‌-2015లోనూ డాన్‌ను ప్రణయ్‌ ఓడించడం గమనార్హం.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.